చావుబ్రతుకుల మధ్య మన తెలుగు వాడిని కాపాడిన పేస్ బుక్ స్నేహం

Header Banner

చావుబ్రతుకుల మధ్య మన తెలుగు వాడిని కాపాడిన పేస్ బుక్ స్నేహం

  Mon Aug 01, 2016 12:15        Exclusives, Telugu

ఫేస్ బుక్  స్నేహాలని మోసం చేస్తుంది, స్నేహాలని  కబళిస్తుంది. నమ్మినవాళ్ళని నట్టేట్లో ముంచుతుంది. ఫేస్ బుక్ ఒక మానియా, ఒక ఫాబియో, ఆరోగ్యాలు పాడుచేసుకుంటున్నారు.  చేతిలో సెల్ ఉంటె చాలు ఫేస్ బుక్, చాటింగ్, స్టేటస్ అప్డేట్స్ అంటూ యువత పెడదారి తొక్కుతున్నారు. మరి ఇలాంటి నేపధ్యంలో ఫేస్ బుక్ తనని కాపాడి తనకి పునర్జన్మ ఇచ్చింది అని ఒక వ్యక్తీ చెప్తుంటే ఎలా ఉంటుంది? నడిరోడ్డుమీద దిక్కుతోచని స్థితిలో ఆక్సిడెంట్ కి గురి అయినప్పుడు ఏ బంధువులు, ఏ కుటుంబ సభ్యులు గుర్తు రాలేదు తన ఫేస్ బుక్ స్నేహితుడు గుర్తురావడం , ఆ మిత్రుడు అలాగే స్పందించడం చెప్పుకోవాల్సిన గొప్ప విషయం ఇది.

రాంబాబు, ఇ వి వి ఫేస్ బుక్ స్నేహితులు. ఇ వి వి గారు ఫేస్ బుక్ లో ఒక గ్రూప్ కి అడ్మిన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ గ్రూప్ కేవలం హాస్యం కోసమే... ఇందులో ఆడవాళ్ళందరూ సోదరీమణులుగా, మగవాళ్ళు బావా బావమరుదులుగా పిలుచుకునే అచ్చతెలుగు గోదావరి వాస్తవ్యులు. ఇక్కడ వేళాకొళాలే తప్ప, వ్యంగ్యాలు, అపహాస్యాలు ఉండవు. అందరు సరదాగా హాస్యం పంచుకుంటూ స్నేహంతో  మనసారా నవ్వేస్తారు. హాస్యం, నవ్వుకోడం, ఒకరినొకరు ఆట పట్టించుకోడం ఇది  ఒక కోణం..

మరోకోణం నిన్నే తెలిసింది.

అర్థ రాత్రి ఈ గ్రూప్ సభ్యుడు రాంబాబు గారు ఘోర కారు ప్రమాదానికి గురి అయ్యారు. అంత అచేతనావస్థ లో కూడా రాంబాబు గారు తన ఫేస్ బుక్ గ్రూప్ అడ్మిన్ కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పడం, అక్కడ చుట్టూ చేరినవారు కూడా “హోప్  లేదు సర్ తొందరగా రండి“ అనడం.. ఆందోళనతో ఉన్నఫళంగా ఇ వి వి గారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ పరస్థితి వాళ్ళు చెప్పినట్లుగానే ఉంది. వరసగా 4 ఆసుపత్రులు అతని కండిషన్ చూసి చేర్చుకోము అని చెప్పగా ఎట్టకేలకు బొల్లినేనిలోని ఆసుపత్రిలో జాయిన్ చేసుకుని అతనికి ప్రాణదానం చేసారు. ఈ సందర్భంగా ఇ వి వి గారిని అభినందిస్తూ గ్రూప్ లో అనేక పోస్ట్ రావడం నేపద్యంలో తానే స్వయంగా ఏమి జరిగిందో ఇలా చెప్పారు చదవండి మీరు కూడా..

Dear family members

నాకు స్నేహం చెయ్యటమన్నా నావల్లయినంత సాయం చెయ్యటమన్నా నాకు చాలా ఇష్టం.
కానీ రాంబాబుకి  చేసిన సాయంలాంటిది ఎవ్వరికీ చేయకూడదని నేను కోరుకుంటున్నాను.
నాకయితే ఎవరికీ చెప్పే ఉద్దేశం లేదు. ఆయనే ఫొటోలతో సహా పెట్టుకున్నాడు,
హేమా (she is one of group member ) మేము మనుషులమే స్పందిస్తాం కదా అంటున్నావు.
అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసి బావా accident అయ్యింది అర్జంటుగా రా బా అంటే ఎక్కడో జరిగిందో చెప్పలేని పరిస్థితిలో  పోరా వుంటే , పక్కనున్నోళ్ళు,  నాతో మీరర్జంటుగా రండి ఏం సెప్పలేం పరిస్ధితంటే నేను ఏరకంగా అక్కడికేళ్ళానో నాకే తెలియదు.
అక్కడ రక్తంమడుగులో వున్న రాంబాబు ని చూస్తే నాకు డౌటే అనిపించింది. హాస్పటల్లో చూస్తే పుర్రె బయటకు కనపడింది.
మూడు ప్రవేటు హాస్పటలోల్లు రిజెక్టు చేసారు.నాలుగ్గంటలకు బొల్లినేనిలో జాయిన్ చేసిన అప్పటికీ డౌటే అప్పుడు రవికి వాళ్ళ కుటుంబసభ్యులకు ఫోన్ చేసాను. ఇలాంటి పరిస్థితుల్లో మీకు కొన్ని లిమిట్సుంటాయి కదా హేమ.అందుచేత నేనెవరికీ చెప్పలేదు.
ఆ  పరిస్థితుల్లో  నేనేకాదు ఎవరున్నా అలాగే స్పందిస్తారు.
దానిగురించి పోస్టులు కామేంట్లు నాకు చేలా ఇబ్బందిగా అనిపిస్తున్నాయి.దయచేసి ఇంక ఆపేయండి. అతని భార్యా పిల్లలఅదృష్టం డాక్టర్ల కృషే ఆయన్ని బ్రతికించింది.
అంతే తప్ప నేను చెసిందేమీలేదు.
మనగ్రూపు తరపున అతన త్వరగా కోలుకోవాలని కోరుకుంటు...

*****

ఫేస్ బుక్ ని నాణానికి రెండువైపులా చూడాలి.

మానవత్వానికి మరో పేరు, స్నేహానికి మరో ప్రతీక అయిన  ఇ వి వి సత్యనారాయణ గారిని కువైట్ ఎన్నారైస్  మనఃస్ఫూర్తిగా అభినందిస్తోంది.   పేస్ బుక్ స్నేహం,ఫేస్ బుక్ మానియా, ఫాబియో,fb friendship, facebook friends