దుబాయ్ లేబర్ లా: నేను ఉద్యోగం మానేయడానికి కంపెనీ వాళ్ళు ఒప్పుకోకుండా, నాకు రావాల్సిన సర్వీస్ ఎండ్ బెనిఫిట్స్ ను నాకివ్వకపోతే నేనేమి చేయాలి?

Header Banner

దుబాయ్ లేబర్ లా: నేను ఉద్యోగం మానేయడానికి కంపెనీ వాళ్ళు ఒప్పుకోకుండా, నాకు రావాల్సిన సర్వీస్ ఎండ్ బెనిఫిట్స్ ను నాకివ్వకపోతే నేనేమి చేయాలి?

  Wed Jan 11, 2017 09:00        Telugu, దుబాయ్ న్యాయ సలహాలు, Gulf News

నేను 20 ఏళ్లుగా షార్జా కు చెందిన కంపెనీ లో పని చేస్తున్నాను. నేను 2016 లో రాజీనామా పత్రాన్ని సమర్పిస్తే, వారు మరో సంవత్సరం నన్ను పనిచెయ్యమని, కంపెనీ     నష్టాల్లో ఉందని అన్నారు. నేను జాబ్ నుండి తప్పుకోవాలనుకుంటున్నాను. మా కంపెనీ వారు నన్ను ఆపాలని ప్రయత్నాలు చేస్తున్నారు. నేను మాత్రం ఇంక ఆ కంపెనీలో పని చేయదలచుకోలేదు. నా భయమంతా వారు నాకు రావాల్సిన సర్వీస్ చివరిలో ఇచ్చే పారితోషకాన్ని (gratuity) ఇవ్వరని. నేను ఒక నెల ముందుగా మా కంపెనీ వారికి నోటీసు ఇచ్చినప్పటికీ వారు నన్ను ఉద్యోగం నుండి తప్పుకోవడానికి అనుమతిని ఇవ్వకపోతే నేనేమి చేయాలి ? న్యాయపరంగా ఎలా ముందడుగు వేయాలి ?

జవాబు: మీ కాంట్రాక్టు అన్లిమిటెడ్ కాంట్రాక్టా లేదా లిమిటెడ్ కాంట్రాక్టా అనేది మీరు మాకు తెలియజేయలేదు. మేము రెండింటిని గురించి మీకు తెలియజేస్తాము.

ఆర్టికల్ 117, 1980 ఫెడరల్ లా నెం. 8, లేబర్ లా ప్రకారం “సరైన కారణంతో, 30 రోజుల ముందు మానేస్తున్నట్లుగా/తీసివేస్తున్నట్లుగా నోటీసును ఇచ్చి  ఉద్యోగి కాని, యజమాని కాని అన్లిమిటెడ్ కాంట్రాక్టు నుండి రద్దు చేసుకోవచ్చును”.

మీది అన్లిమిటెడ్ కాంట్రాక్టు అయితే ఆర్టికల్ 132 ప్రకారం మీరు 30 రోజుల ముందే రాజీనామా చేస్తున్నట్లుగా కంపెనీ వారికి నోటీస్ ఇచ్చారు కాబట్ట్టి మీరు gratuity పొందుటకు అర్హులు.

ఒకవేళ మీది లిమిటెడ్ కాంట్రాక్టు అయితే మీరు 30 రోజుల ముందుగా నోటీస్ ఇవ్వకుండానే మీ సర్వీస్ నుండి తప్పుకోవచ్చు. అయితే, మీ యజమానికి మీ 45 రోజుల  జీతాన్ని నష్టపరిహారం క్రింద చెల్లించాలి.


   dubai labor law, dubai labor law question and answers