ఆహా ఏమి అనరా మైమరచి.... బ్రెడ్ తో ఖీర్, రసమలై

Header Banner

ఆహా ఏమి అనరా మైమరచి.... బ్రెడ్ తో ఖీర్, రసమలై

  Sun Nov 04, 2018 13:20        Recipes, Telugu

బ్రెడ్‌ పుడ్డింగ్‌
 
కావలసిన పదార్థాలు
వైట్‌ బ్రెడ్‌ స్లైసులు: ఎనిమిది(కావలసిన సైజులో ముక్కలుగా చేసుకోవాలి), కిస్మిస్‌: అరకప్పు, చిక్కని పాలు: నాలుగు లీటర్లు, గుడ్డు: ఒకటి, వెనిలా ఎక్స్‌ట్రాక్ట్‌: ఒక టేబుల్‌ స్పూను, చక్కెర: మూడు లేదా నాలుగు టీ స్పూన్లు, యాలకుల పొడి: అర టీస్పూను.
తయారీ విధానం
దీనికి ఓవెన్‌ అయితేనే బాగుంటుంది. ముందుగా ఓవెన్‌లోని వెడల్పాటి ప్లేటులో బ్రెడ్‌ ముక్కలను సమానంగా పరుచుకోవాలి. ఇప్పుడు గిన్నెలో పాలు తీసుకునిబాగా కాచుకోవాలి. పాలు చల్లారిన తరువాత చక్కెర, యాలకుల పొడి, వెనిలా ఎక్స్‌ట్రాక్ట్‌, గుడ్డు సొన వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని బ్రెడ్డు ముక్కల మీద సమానంగా పోసుకోవాలి. ఇప్పుడు వాటి మీద కిస్మిస్‌లను చల్లుకుని ఓవెన్‌లో 55 నిమిషాల పాటు బేక్‌ చేసుకోవాలి. చల్లారిన తరువాత తింటే రుచిగా ఉంటుంది.
 
బ్రెడ్‌ ఖీర్‌
 
కావలసిన పదార్థాలు
చిక్కని పాలు: లీటరు, బ్రెడ్‌ స్లైసులు: నాలుగు(ముక్కలుగా చేసుకోవాలి), చక్కెర: అరకప్పు, చక్కెరపొడి: టేబుల్‌ స్పూను, ఐసింగ్‌ షుగర్‌: టేబుల్‌ స్పూను, యాలకుల పొడి: అర టీస్పూను, కుంకుమపువ్వు: అర టీస్పూను(పాలల్లో నానపెట్టుకోవాలి), బాదం, పిస్తాలు: మూడు స్పూన్ల చొప్పున
తయారీ విధానం
ఒక ప్లేటులో బ్రడ్‌ ముక్కలను పరిచి దాని మీద కొద్దిగా పాలు, చక్కెరపొడి చల్లుకోవాలి. ఐదు పది నిమిషాల తరువాత వీటిని చేతితో ముద్దగా చేసుకుని కావలసిన సైజులో బాల్స్‌గా చేసుకోవాలి. వీటిని చక్కెరలో దొర్లించి ఫ్రిజ్‌లో ఓ అరగంట పాటు పెట్టుకోవాలి. ఇప్పుడు పాలను బాగా మరిచిగించుకోవాలి. పాలు సగం అయ్యేదాకా ఉంచి దానిలో బ్రెడ్‌ బాల్స్‌ తప్ప మిగతా అన్ని పదార్థాలు వేసి మరికొద్దిసేపు ఉంచి పొయ్యి మీద నుంచి దించేయ్యాలి, సర్వ్‌ చేసే ముందు మాత్రమే పాలల్లో బ్రెడ్‌ బాల్స్‌ వేసుకోవాలి.
 
 
బ్రెడ్‌ రసమలై
 
కావలసిన పదార్థాలు
చిక్కనిపాలు: అరలీటరు, బ్రెడ్‌ స్లైసులు: నాలుగు, చక్కెర: ఐదు టీ స్పూన్లు, కుంకుమపువ్వు: కొద్దిగా, నెయ్యి: రెండు స్పూన్లు్, పిస్తా, బాదంపప్ప: సరిపడ
తయారీ విధానం
పాలను సగం అయ్యేవరకూ బాగా కాగనివ్వాలి. ఇప్పుడు కుంకుమపువ్వు, బాదం పిస్తా, చక్కెర వేసి మరికొద్దిసేపు మరగనివ్వాలి. ఇప్పడు బ్రెడ్‌ స్లైసులను కావలసిన సైజులో కట్‌ చేసుకుని వాటి మీద ఈ పాల మిశ్రమాన్ని పోసి సర్వ్‌ చేయాలి. బ్రెడ్‌ను ఎక్కువ సేపు నానకుండా తినేయాలి.
 
బ్రెడ్‌ స్వీట్‌
 
కావలసిన పదార్థాలు
బ్రెడ్‌ స్లైసులు: నాలుగు, పాలు: పావు లీటరు, చక్కెర: పావుకిలో, నూనె లేదానెయ్యి: వేయించడానికి తగినంత
తయారీ విధానం
బ్రెడ్‌ చుట్టూ తీసేసి మధ్యలో ఉండేదాన్ని రెండు ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు పాన్‌లో నెయ్యి లేదా నూనె వేసుకుని ఈ బ్రెడ్‌ ముక్కలను డీప్‌ ఫ్రై చేసుకోవాలి. వీటిని ఓ ప్లేటులో తీసి పెటుకోవాలి. తరువాత అదే పాన్‌లో చక్కెర వేసి తడిసేంతవరకూ నీరు పోసి చిక్కని పాకం పట్టుకోవాలి. మరొక గిన్నెలో పాలు పావుభాగం అయ్యేంత వరకూ మరిగించుకోవాలి. పాకం చల్లారిన తరువాత బ్రెడ్‌ ముక్కలు దానిలో ముంచి ప్లేటులో సర్దాలి. ఇప్పుడు పాలను బ్రెడ్‌ మీద పోయాలి. వీటిని వెంటనే తింటే బాగుంటుంది.

ADVERTISEMENT
   ఆహా ఏమి అనరా మైమరచి.... బ్రెడ్ తో ఖీర్, రసమలై