గిన్నిన్ రికార్డ్స్ లో చేరనున్న ‘పీహూ’

Header Banner

గిన్నిన్ రికార్డ్స్ లో చేరనున్న ‘పీహూ’

  Mon Oct 29, 2018 14:30        Cinemas, Telugu

బాలీవుడ్‌ చిత్రం ‘పీహూ’ ట్రైలర్‌కు విశేషమైన ఆదరణ లభిస్తోంది. మైరా విశ్వకర్మ అనే రెండేళ్ల చిన్నారి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. జాతీయ అవార్డు గ్రహీత వినోద్‌ కాప్రి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు అనూహ్య స్పందన లభించింది. అయితే ఈ చిత్రాన్ని గిన్నీస్‌ రికార్డులో చేర్చడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. రెండేళ్ల చిన్నారి ప్రధాన పాత్రలో నటించిన ఏకైక చిత్రంగా ఇది రికార్డు సృష్టించింది. సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌, శిల్పా జిందాల్, రోన్నీ స్క్రూవాలా ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

‘ప్రతీ తల్లిదండ్రులకు వచ్చే పీడకల ఇది..’ అనే కాన్సెప్ట్‌తో నిజ జీవిత సంఘటన ఆధారంగా ‘పీహూ’ చిత్రాన్ని తెరకెక్కించారు. పీహూ అనే రెండేళ్ల చిన్నారి ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఏం చేసింది? తల్లి చనిపోయిందని తెలీని ఆ పసి పిల్ల అమ్మ ఎప్పుడు లేస్తుందా అని ఎదురుచూస్తూ చివరకు ఏం చేసింది? అన్న నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. రూ.45 లక్షల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్‌ 16న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.   గిన్నిన్ రికార్డ్స్ లో చేరనున్న ‘పీహూ’