ఇండోనేషియాలో విమానం గల్లంతు

Header Banner

ఇండోనేషియాలో విమానం గల్లంతు

  Mon Oct 29, 2018 13:57        Auto, Telugu

ఇండోనేషియాలో విమానం గల్లంతయ్యింది. జకార్తా నుంచి టేకాఫ్ అయిన 13 నిమిషాలకే విమానం కనిపించకుండా పోయింది. రాడార్‌తో సంబంధాలు తెగిపోవడంతో సముద్రంలో కూలిపోయిందని భావిస్తున్నారు. లయన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం పంగకల్‌ పిన్నాంగ్‌‌కు వెళ్లాల్సి ఉంది. ఇందులో మొత్తం 188 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వారంతా మరణించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జావా సముద్రంలో ప్రయాణికుల వస్తువులు, జెట్ విడిభాగాలు కనిపించడంతో విమానం కూలిందన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. దాంతో విమాన శిథిలాల కోసం గాలింపు చర్యలు ముమ్మరమయ్యాయి.   ఇండోనేషియాలో విమానం గల్లంతు