తేనీటి ప్రియులకు కొత్తరుచులు

Header Banner

తేనీటి ప్రియులకు కొత్తరుచులు

  Mon Oct 29, 2018 13:51        Business, Telugu

ప్రపంచంలో రకరకాలు టీలున్నాయి. అయినా ఇంకా కొత్తవి పుట్టుకువస్తూనే ఉన్నాయి. అవి తేనీటి ప్రియులకు మరిన్ని కొత్త రుచులను అందిస్తున్నాయి. తాజాగా మార్కెట్‌లోకి కొత్త తరహా టీ ఆకులు ప్రవేశించాయి. దీని ధర ఎంతో తెలిస్తే షాకవడం ఖాయం. ఈ టీ ఆకుల ధర అక్షరాలా కిలో రూ. 24,501. ఈ టీ అరుణాచల్ ప్రదేశ్‌లోని సియాంగ్ జిల్లాలో ఈ టీఆకులు లభ్యమవుతాయి. ఈ టీ చూసేందుకు వంకాయి రంగులో కనిపిస్తుంది. చాయ్ మీద పరిశోధనలు చేసే ఒక సంస్థ ఈ తేనీరుకు గల చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేసింది. తొలుత ఈ చాయ్‌ని కీనియాలో వినియోగించారని తెలుస్తోంది. ఈ అలవాటు అక్కడి నుంచి అరుణాచల్ ప్రదేశ్‌కు వచ్చినట్లు సమాచారం. ఈ చాయ్ రిచ్ క్వాలిటీతో కూడి ఉంటుంది. కాగా ఈ చాయ్ క్యాన్సర్, హార్ట్ ఎటాక్ లాంటి ప్రాణాంతక వ్యాధుల బారి నుంచి కాపాడుతుందని తెలుస్తోంది. కాగా ఈ తేయాకును అడవుల్లోనే పండించి తీసుకువస్తారని తెలుస్తోంది. గతంలో ఈ టీ రూ. 15,000 ఉండగా, ఇప్పుడు మరింత ప్రియం అయ్యింది.   తేనీటి ప్రియులకు కొత్తరుచులు