విదేశాల్లోని న‌ల్ల‌ధ‌నాన్ని తీసుకురాలేక‌పోయారు ః చంద్ర‌బాబు

Header Banner

 విదేశాల్లోని న‌ల్ల‌ధ‌నాన్ని తీసుకురాలేక‌పోయారు ః చంద్ర‌బాబు

  Sat Oct 27, 2018 15:55        APNRT, Auto, అమరావతి కబుర్లు, India, Telugu, World


అమ‌రావ‌తి ః
విదేశాల్లోని నల్లధనాన్ని తీసుకొస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని, ్డ కానీ అలాగ చేయ‌లేక‌పోయార‌ని ముఖ్య‌మం్ర‌తి నారా చం్ర‌ద‌బాబునాయుడు విమ‌ర్శించారు. ఢిల్లీలో ప‌ర్య‌ట‌న‌లో ఉన్న చంద్ర‌బాబు ప‌లువురు నేత‌ల‌ను క‌లిసి ప‌లు అంశాల‌పై మాట్లాడారు. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఏపీ భవన్‌లో ఆయన టీడీపీ ఎంపీతో భేటీ అయ్యారు. అనంతరం ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయంపై జాతీయ మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ దేశంలో ఏం జరుగుతోందో మనం తెలుసుకోవాలి. రాజకీయ పార్టీల మధ్య ఆరోగ్యకరమైన పోటీ అవసరం. బలమైన రాష్ట్రాలు, బలమైన కేంద్రం ఉండాలి. కో ఆపరేటివ్‌ ఫెడరలిజం అమలు చేస్తామని బీజేపీ చెప్పింది. దేశవ్యవస్థలన్నీ పటిష్ఠంగా ఉండాలి. పార్టీలను, వ్యవస్థలను బలహీనపరుస్తున్నారు’’ అని ఆరోపించారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ జిటల్‌ ఎకానమీతో బ్లాక్‌మనీని నిరోధించవచ్చని చెప్పానని ఈ సందర్భంగా బాబు గుర్తు చేశారు. పెద్దనోట్లను రద్దు చేశారని, నేనూ సమర్థించానని చెప్పారు. దానికి విరుద్ధంగా రూ.2వేలు, రూ.500 పెద్ద నోట్లు తీసుకొచ్చారని, ఇప్పటికి కూడా నగదు కొరత కొనసాగుతోందని ఆరోపించారు. నోట్ల రద్దు సరైన నిర్ణయం కాదని రిజర్వుబ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామరాజన్‌ చెప్పారని తెలిపారు.

‘‘బ్యాంకులపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు. నీరవ్‌మోదీ, విజయ్‌మాల్యా దేశం నుంచి ఎలా పారిపోయారు. నేరస్థులను ఏమీ చేయలేకపోతున్నారు. దేశంలో బ్యాంకులన్నీ దివాలా తీసే పరిస్థితి వచ్చింది. తుపాను సహాయ కార్యక్రమాలకు ఆర్బీఐ నగదు ఇవ్వలేకపోయింది. డాలర్‌తో రూపాయి విలువ ఊహకతీతంగా పెరిగిపోయింది. పెట్రో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దేశంలో ఏ ఒక్క రైతూ సంతోషంగా లేడు. రైతుకు మద్దతు ధర ఇవ్వలేకపోతున్నారు. 2కోట్ల ఉద్యోగాలు ఎప్పుడు కల్పిస్తారు. నోట్ల రద్దుతో వృద్ధిరేటు ఆగిపోయింది’’ అని చంద్రబాబు విమర్శించారు.   babu