ఢిల్లీలో సిఎం చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌

Header Banner

ఢిల్లీలో సిఎం చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌

  Sat Oct 27, 2018 15:43        APNRT, Associations, Auto, అమరావతి కబుర్లు, India, Telugu, World


అమ‌రావ‌తి ః ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. శనివారం ఉదయం హస్తినకు బయల్దేరి వెళ్లిన ఆయన తొలుత తెదేపా ఎంపీలతో ఏపీ భవన్‌లో భేటీ అయ్యారు. అనంతరం చంద్రబాబుతో లోక్‌తంత్రిక్‌ జనతాదళ్‌ వ్యవస్థాపకుడు శరద్‌ యాదవ్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సమావేశమయ్యారు. జమ్మూకశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ అధినేత ఫరూక్‌ అబ్దుల్లాతోనూ కాసేపట్లో సీఎం భేటీ కానున్నారు. అనంతరం ఈ మధ్యాహ్నం 3 గంటలకు కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో మాట్లాడతారు. ఏపీకి కేంద్రం మొండిచేయి చూపడం, విభజన చట్టం పెండింగ్‌ అంశాలతో పాటు ఏపీలోని రాజకీయ పరిణామాలు, తెదేపా లక్ష్యంగా జరుగుతున్న ఐటీ దాడులను చంద్రబాబు ప్రస్తావించనున్నారు. రఫేల్‌ అంశంతో పాటు సీబీఐ వ్యవహారాలపైనా మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ‘డెమోక్రసీ ఇన్‌ డేంజర్‌.. టార్గెట్‌ ఏపీ’ పేరుతో సీఎం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు.

    cm