నిద్రపట్టకపోవడం మీ సమస్యా...?

Header Banner

నిద్రపట్టకపోవడం మీ సమస్యా...?

  Fri Oct 26, 2018 10:47        Health, Telugu

చాలామంది మహిళలకు కంటినిండా నిద్రపోయే అవకాశం ఉండదు. అలాంటివారు రోజులో ఏ కాస్త సమయం దొరికినా ఓ చిన్న కునుకు తీస్తే మంచిదట. దీన్నే పవర్‌న్యాప్‌ అంటున్నారు నిపుణులు. ఇలా కనీసం ఓ పది నిమిషాలు చేస్తే మిగతా రోజంతా ఉత్సాహంగా ఉంటారట.

అపోహ-వాస్తవం

ఫోను లేదా టీవీ చూస్తేనే నిద్ర ముంచుకువస్తుంది అనుకుంటారు కొందరు. అది పూర్తిగా అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు. అలా ఫోను లేదా టీవీ చూడటం వల్ల నిద్ర రాదు సరికదా! క్రమంగా ఆ రేడియో తరంగాలు మనకి నిద్రలేమి సమస్యను తెచ్చిపెడతాయట. అందుకే నిద్రపోవడానికి కనీసం గంట ముందు నుంచే ఎలక్ట్రానిక్‌ పరికరాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు.

వ్యాయామం

నిద్రలేమితో బాధపడేవారు యోగాను ఎంచుకోవడం మంచిది. శరీరాన్ని సాగదీసి చేసే ఆసనాలు, దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలే వ్యాయామాల వల్ల హాయిగా నిద్రపడుతుందన్నది యోగా నిపుణుల మాట.

సమస్య- పరిష్కారం

పొద్దున్నే మంచం మీదనుంచి లేవలేకపోతున్నాం అంటే... దానికి కారణం నిద్ర అనుకుంటాం. కానీ ఆ సమస్యను డిసానియా అంటారు. పోషకాహారలోపం, ఒత్తిడితోపాటు ఇతర అంశాలెన్నో ఇందుకు కారణం. ఇలా దీర్ఘకాలం బాధపడుతుంటే వైద్యుల్ని కలవడం తప్పనిసరి.


   నిద్రపట్టకపోవడం మీ సమస్యా...?