అమెరికాలో తెలుగు సాహిత్య వెలుగులు

Header Banner

అమెరికాలో తెలుగు సాహిత్య వెలుగులు

  Thu Oct 25, 2018 15:48        APNRT, Auto, అమరావతి కబుర్లు, India, Kuwait, Telugu, World


అమ‌రావ‌తి : అమెరికాలోని ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నెల నెలా తెలుగు వెన్నెల’ సాహిత్య సదస్సు అక్టోబర్ 21న సాహిత్య వేదిక సమన్వయకర్త వీర్నపు చినసత్యం అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ప్రవాసంలో నిరాటంకంగా 135 నెలల పాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్య సదస్సు కొనసాగుతోంది. భాషాభిమానులు, సాహిత్య ప్రియులు అధిక సంఖ్యలో పాల్గొని సభలను జయప్రదం చేశారు. చిన్నారులు వేముల సాహితి, వేముల సింధూర ఆలపించిన ప్రార్థనా గీతంతో కార్యక్రమం మొదలైంది. డాక్టర్‌ ఊరిమిండి నరసింహా రెడ్డి, చంద్రహాస్ మద్దుకూరి, డా. ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి దేవరకొండ తదితర సాహితీవేత్తలు వారి సాహితీ ప్రతిభను కార్యక్రమానికి విచ్చేసిన వారితో పంచుకున్నారు. శ్రీనాథుని పద్య వైభవాన్ని రమణ జువ్వాడి కొన్ని పద్యాలు చదివి వివరించారు. డా. పుదూర్ జగదీశ్వరన్ ఆముక్తమాల్యద లోని కొన్ని పద్యాలను రాగ యుక్తంగా చదివి వాటి అర్థం వివరించారు. ఉమాభారతి రాసిన ‘సరికొత్త వేకువ’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. బసాబత్తిన నాట్య భారతీయం, సరికొత్త వేకువ పుస్తకాలను ఆవిష్కరించారు. ఉమాభారతి కోసూరి మాట్లాడుతూ.. మనిషి మానసిక ఎదుగదల, సంక్షేమాలపై సాహిత్య, లలితకళల ప్రభావం తప్పక ఉంటుందన్నారు. ఈ సందర్భంగా టాంటెక్స్ సాహిత్య వేదిక సభ్యులు, అధ్యక్షురాలు శీలం కృష్ణవేణి, ఉత్తరాధ్యక్షుడు వీర్నపు చినసత్యం, ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి కోడూరు, కార్యదర్శి శ్రీలు మండిగ, పాలకమండలి సభ్యులు ఆమెను శాలువా, జ్ఞాపిక ఇచ్చి ఘనంగా సత్కరించారు. అనంతరం ఉమాభారతి నృత్య సేవలను కొనియాడారు. సాహిత్యం మీద ప్రేమ, మాతృభాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీప్రియులకు టాంటెక్స్‌ సమన్వయకర్త వీర్నపు చినసత్యం కృతజ్ఞతలు తెలిపారు.   telugu