రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేస్తున్న కేం్ర‌దం ః చంద్ర‌బాబు

Header Banner

రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేస్తున్న కేం్ర‌దం ః చంద్ర‌బాబు

  Thu Oct 25, 2018 15:33        APNRT, అమరావతి కబుర్లు, India, Telugu, World


విజ‌య‌వాడ ః ప్రశ్నించేవారిని దాడులతో భయపెట్టాలని కేంద్రం చూస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. సిబిఐలో నెలకొన్న పరిణామాలపై బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అవినీతిని పట్టుకోవాల్సిన వాళ్లే అవినీతిలో భాగస్వాములు కావడం పతనానికి పరాకాష్ట అని పేర్కోన్నారు. బిజెపి నేతలు చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి అనేక తప్పులు చేస్తున్నారన్నారని విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కేంద్రం నిర్వీర్యం చేస్తోందని, సిబిఐ డైరెక్టర్‌ను రాత్రికి రాత్రి విధుల నుంచి తొలగించడం చూస్తే వీరి పాలనలో ఏవ్యవస్థ కూడా స్వతంత్రంగా పనిచేయడం వీరికి ఇష్టంలేదనిపిస్తోందని తెలిపారు. దర్యాప్తు సంస్థలకు స్వతంత్ర ప్రతిపత్తినిస్తూ సుప్రీంకోర్టు వినీత్‌ నారాయణ్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో ఇచ్చిన ఆదేశాలను కేంద్రం తుంగలో తొక్కిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉన్న కమిటీ సిబిఐ డెరెక్టరును ఎంపిక చేయాలని పేర్కొన్నారు. సిబిఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మను విధుల నుంచి తప్పించడం సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లఘించడమేనని పేర్కొన్నారు. ఈ పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య మనుగడకు పెనుముప్పని ఆవేదన వ్యక్తం చేశారు. రాఫెల్‌ కుంభకోణాన్ని విచారణకు చేపడతారనే భయంతోనే సిబిఐ డైరెక్టర్‌ను తొలగించారని విమర్శించారు. దీని ద్వారా రాఫెల్‌ స్కాంతో కేంద్రానికి సంబంధం ఉందనేది రుజువయ్యిందని పేర్కొన్నారు. ఈ పరిణామాలకు ప్రధాని మోడీనే బాధ్యత వహించి, జాతికి సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.   cm