ఎపిలో మెరుగైన ప‌నితీరు

Header Banner

ఎపిలో మెరుగైన ప‌నితీరు

  Thu Oct 25, 2018 14:46        APNRT, అమరావతి కబుర్లు, India, Telugu, World


కలెక్టర్ల సదస్సులో మంత్రి యనమల
విజ‌య‌వాడ ః అన్ని రంగాల్లోనూ ఆంధ్రప్రదేశ్‌ ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన పనితీరు కనబరుస్తోందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ప్రస్తుతం ఏ రంగంలో ఎంత మేరకు రాణిస్తున్నామనేది ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవాలన్నారు. ప్రధాన రంగాలకు తోడు అనుబంధ రంగాలను అభివృద్ధి చేసుకోవాల్సి ఉందన్నారు. అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రాథమిక రంగంలో వృద్ధి రేటు బాగుందని, ఇప్పుడున్న రెండంకెల వృద్ధిని సుస్థిరం చేయాలని యనమల కోరారు. రానున్న కాలంలో ఇదే వృద్ధిని కొనసాగించడానికి ఎటువంటి కృషి చేయాలో మార్గదర్శనం చేసుకోవాలన్నారు. తయారీ, పర్యాటక రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.   yana