రిలయన్స్‌ - బ్రిటిష్ పెట్రోలియంతో కలసి పెట్రోల్‌ 2000 పంపుల ఏర్పాటుకు యత్నం

Header Banner

రిలయన్స్‌ - బ్రిటిష్ పెట్రోలియంతో కలసి పెట్రోల్‌ 2000 పంపుల ఏర్పాటుకు యత్నం

  Wed Oct 24, 2018 13:16        Business, Telugu

 ప్రపంచ చమురు మార్కెట్లలో భారత్‌ కీలకమైంది. ఇక్కడ ఏటా చమురు విక్రయాలు పెరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో బ్రిటన్‌కు చెందిన బ్రిటిష్‌ పెట్రోలియంతో కలిసి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ దేశవ్యాప్తంగా 2,000 పెట్రోల్‌ పంపులను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ ప్రణాళిక వచ్చే మూడేళ్లలో పూర్తికానుంది. దీనిపై ఇప్పటికే రిలయన్స్‌ - బీపీలు కలిసి పనిచేస్తున్నాయి. మరికొన్ని నెలల్లో దీనికి ఓ రూపునివ్వొచ్చని సమాచారం. ప్రపంచ చమురు మార్కెట్లలో భారత్‌ కీలకమైంది. ఇక్కడ ఏటా చమురు విక్రయాలు పెరుగుతున్నాయి. 

దీనిపై రిలయన్స్‌ జాయింట్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ వి.శ్రీకాంత్‌ మాట్లాడుతూ ‘‘ఇప్పటికే మేము బ్రిటిష్‌ పెట్రోలియంతో ఎంవోయూ చేసుకొన్నాము. కానీ విధివిధానాలు ఇంకా నిర్ణయించలేదు. రిటైల్‌ మార్కెట్లో మేము విస్తరిస్తాము. ఇప్పుడు అది మా ప్రణాళికలో ఉంది.’’ అని పేర్కొన్నారు.

రిలయన్స్‌కు దేశ వ్యాప్తంగా 1,343 పెట్రోల్‌ పంపులు ఉన్నాయి. మరో పక్క బ్రిటిష్‌ పెట్రోలియం సంస్థ 2016 అక్టోబర్‌లోనే దేశంలో 3,500 పెట్రోల్‌ పంపుల ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతులను పొందింది. ఇప్పటికే బీపీ రిలయన్స్‌తో కలిసి చమురు అన్వేషణ ప్రాజెక్టులు కూడా చేపట్టింది.


   రిలయన్స్‌ - బ్రిటిష్ పెట్రోలియంతో కలసి పెట్రోల్‌ 2000 పంపుల ఏర్పాటుకు యత్నం