ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో డెలాయిట్‌ కంపెనీ ఏర్పాటు

Header Banner

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో డెలాయిట్‌ కంపెనీ ఏర్పాటు

  Wed Oct 24, 2018 12:59        Business, Telugu

విశాఖపట్టణం : ఆంధ్రప్రదేశ్‌లో డెలాయిట్‌ కంపెనీ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు విశాఖ ఫెస్టివల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్‌ సమక్షంలో ఆంధ్రప్రదేశ్‌ ఐటీశాఖ, డెలాయిట్‌ మధ్య ఒప్పందం జరిగింది. గ్లోబల్‌ బిజినెస్‌ ట్యాక్స్‌ సర్వీసెస్‌, గ్లోబల్‌ ఎంప్లాయిస్‌ సేవలను, కన్సల్టెంట్‌‌, ఆడిట్‌ సేవలను డెలాయిట్‌ అందిస్తోంది.
 
త్వరలో అమరావతి తాత్కాలిక భవనంలో డెలాయిట్‌ కార్యకలాపాలను ప్రారంభించనుంది. విశాఖలో కూడా కార్యకలాపాలను సాగించాలని ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ కోరారు. విశాఖలో అవకాశాలపై అధ్యయనం చేస్తామని, త్వరిత గతిన కంపెనీ ఏర్పాటుపై దృష్టిపెడతామని డెలాయిట్‌ పేర్కొంది. 
 

    ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో డెలాయిట్‌ కంపెనీ ఏర్పాటు