రూ.275 కోట్లు విడుదల...ఏపీ నిట్‌కు

Header Banner

రూ.275 కోట్లు విడుదల...ఏపీ నిట్‌కు

  Fri Oct 19, 2018 15:25        APNRT, Associations, అమరావతి కబుర్లు, Technology, Telugu


అమ‌రావ‌తి ః ఆంధ్రప్రదేశ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ రూ.275 కోట్లు విడుదల చేసింది. అందులో రూ.195 కోట్లతో తొలి విడత శాశ్వత క్యాంపస్‌ భవనాల నిర్మాణాన్ని చేపడతారు. ఇప్పటికే తాడేపల్లిగూడెం పాత విమానాశ్రయ భూముల్లో 172.6 ఎకరాల విస్తీర్ణంలో శాశ్వత క్యాంపస్‌ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు ప్రధాన సమస్యగా మారిన హాస్టల్స్‌, ప్రయోగశాలలతోపాటు, తరగతి భవనాలు, స్టాఫ్‌ క్వార్టర్స్‌, పరిపాలన భవనాలను నిర్మించనున్నారు. మలి విడతలో మరో రూ.146 కోట్లతో భవన నిర్మాణాలకు ప్రతిపాదనలు చేస్తున్నారు. పనుల నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిధులు విడుదల కావడంతో నిట్‌ అధికారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.   tec