రాజ‌ధాని ్ర‌గామాల్లో నూత‌న సొబ‌గులు

Header Banner

రాజ‌ధాని ్ర‌గామాల్లో నూత‌న సొబ‌గులు

  Wed Oct 17, 2018 13:54        APNRT, Associations, Auto, అమరావతి కబుర్లు, India, Telugu, World


133 కోట్లతో ప్రణాళికలు సిద్ధం
అమ‌రావ‌తి ః రాజ‌ధాని అమ‌రాతి సిగ‌లోని మంగళగిరి మండలంలోని రాజధాని గ్రామాలకు మహర్దశ పట్టనుంది. అమరావతి రాజధాని నిర్మాణానికి 33వేల ఎకరాల భూమిని ఇచ్చి పలువురు ఆదర్శంగా నిలిచిన 29 రాజధాని గ్రామాల వారికి సకల మౌలిక సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని భావించిన ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి చర్యలు చేపట్టింది. రాజధాని గ్రామాల్లో ప్రజలకు అవసరమైన రోడ్లు, డ్రైన్లు, రక్షిత మంచి నీటి పథకం, అంగన్‌వాడీ, పార్కు, స్కూల్స్‌, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశువుల ఆసుపత్రి, ఇంటి ఇంటికి చెత్త సేకరణ వంటి పలు మౌలిక సదుపాయాల కల్పనకు సీఆర్డీయే నడుం బిగించింది. అంచనాలు పంపితే ప్రాధాన్యత క్రమంలో పనులు చేస్తామని సీఆర్డీయే అధికారులు సంబంధిత గ్రామ కార్యాదర్శులకు తెలిపారు. మంగళగిరి మండలంలో 14 గ్రామాలున్నాయి. అందులో 7 గ్రామాలు రాజధాని పరిధిలోకి వెళ్లాయి. ఆ గ్రామాల్లో చేయవల్సిన పనులను గుర్తించేందుకు సీఆర్డీయే గ్రామ కమిటీ సమక్షంలో గ్రామంలోని పెద్దలు, ముఖ్యమైన వారితో సమావేశం నిర్వహించి పనుల నివేదికను సీఆర్డీయే వారికి అందజేశారు. అత్యవసర పనులను 90 రోజుల్లో పూర్తి చేసేందుకు సీఆర్డీయే కసరత్తు ప్రారంభించింది.

అంచనాలు ఇలా..
మంగళగిరి నియోజకవర్గంలోని రాజధాని గ్రామాలైన ఉండవల్లి, పెనుమాక, కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, నీరుకొండ, ఎర్రబాలెం, బేతపూడి, నవులూరు గ్రామాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచేటందుకు రూ.133కోట్లతో ప్రణాళికను సిద్ధం చేశారు. తొలుత స్థానిక అవసరాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఉండవల్లికి రూ.36.5కోట్లు, పెనుమాకకు రూ.11.02కోట్లు, కృష్ణాయపాలెంకు రూ.3కోట్లు, నిడమర్రుకు రూ.12.2కోట్లు, కురగల్లుకు రూ.10.64కోట్లు, నీరుకొండకు రూ.3.92కోట్లు, ఎర్రబాలేనికి రూ.29.65కోట్లు, బేతపూడికి రూ.10.3కోట్లు, నవులూరుకు రూ.15.75కోట్లతో అంచనాలను రూపొందించారు. ముందుగా గ్రామాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అందుకు అవసరమైన యంత్ర సామాగ్రిని గ్రామాలకు అందజేస్తారు. ప్రతి గ్రామానికి తొలుత రూ.20 లక్షల నుంచి రూ. 30లక్షల కేటాయింపు జరిగింది. సిబ్బందిని కూడా స్థానికంగానే తీసుకుంటున్నారు.
ప్రణాళికలు రూపొందించాం..

జి.వీరాంజనేయులు, మంగళగిరి ఎంపీడీవో
గ్రామాలు నగరాలుగా మార్పు
మంగళగిరి మండలంలోని రాజధాని గ్రామాల్లో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలను మెరుగుపరచేందుకు సీఆర్డీయే రంగం సిద్ధం చేస్తుంది. గ్రామాలను కూడా నగరాలుగా మార్పు చేసే చర్యలు చేపట్టనున్నారు. గ్రామాలలో సీసీ రోడ్లు, డ్రైన్లు, పాఠశాలలు, ట్రపభుత్వ భవనాలు, అంగన్‌వాడీలను అభివృద్ధి చేయాలన్నదే ప్రధాన ఉద్దేశం. ఇంటింటికి తిరిగి చెత్తను స్వీకరించి అమరావతి నగరానికి దూరంగా ఏర్పాటు చేసే డంపింగ్‌ యార్డు తరలించే చర్యలు జరుగుతున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనలో ప్రజలందరూ సహకరించాలి. అప్పుడే మార్పు సాధ్యమవుతుంది.

 


   amaravathi