‘మీడియా’ ఇన్‌స్టిట్యూట్‌..రాజధానిలో

Header Banner

‘మీడియా’ ఇన్‌స్టిట్యూట్‌..రాజధానిలో

  Tue Oct 16, 2018 07:12        APNRT, Associations, అమరావతి కబుర్లు, India, Telugu, World

 

అమరావతి: అమరావతిలో మీడియా సిటీ స్థాపన దిశగా ఏపీసీఆర్డీయే ముందడుగు వేసింది. రాజధాని ఆర్థికాభ్యున్నతికి ప్రతిపాదించిన 9 థీమ్‌ సిటీల్లో ఒకటైన దీనిద్వారా 2036 నాటికి 60,000 నుంచి 65,000 ప్రత్యక్ష ఉద్యోగాలు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో దాదాపు 40వేల పోస్టులకు సుశిక్షితులైన ప్రొఫెషనల్స్‌ అవసరమవుతారని అంచనా. ఇందులో భాగంగా రాజధానిలో మీడియా రంగానికి సంబంధించి ఉత్తమ శిక్షణను ఇచ్చే అడ్వాన్స్‌డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను నెలకొల్పాలని సీఆర్‌డీయే భావించింది. ఇందుకోసం సుప్రసిద్ధ సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ(ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌- ఈవోఐ)లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ను ఇచ్చింది. ఈనెల 25న విజయవాడలోని సీఆర్డీయే కార్యాలయంలో ప్రి-ఈవోఐ సమావేశం నిర్వహించనున్నారు.   amaravathi