29న ఏఎన్‌యూలో జ్ఞానభేరి

Header Banner

29న ఏఎన్‌యూలో జ్ఞానభేరి

  Mon Oct 15, 2018 06:54        APNRT, Auto, అమరావతి కబుర్లు, Education, India, Telugu, World


హాజరుకానున్న సీఎం చంద్రబాబునాయుడు
అమ‌రావ‌తి ః రాష్ట్రప్రభుత్వం చేపట్టిన జ్ఞానభేరి కార్యక్రమం ఈ నెల 29వ తేదీన జిల్లాలో జరగనుంది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట ఉన్న బైబిల్‌ మిషన్‌ గ్రౌండ్స్‌లో వర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలల విద్యార్థులతో సీఎం చంద్రబాబునాయుడు ముఖాముఖిగా సంభాషిస్తారు. వేలమంది విద్యార్థులు పాల్గొనే ఈ కార్యక్రమానికి విస్త్రృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో శనివారం వర్సిటీ ఆచార్యులతో కలెక్టర్‌ కోన శశిధర్‌ సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ విశ్వవి ద్యాలయం పరిధిలో జ్ఞానభేరి కార్యక్రమాన్ని విద్యా శాఖ నిర్వహి స్తోంది. ఇప్పటికే ఏయూ, తిరుపతిలో సభలు జరిగాయి. సీఎంతో పాటు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, పలువురు ప్రము ఖులతో ముఖాముఖిగా భేటీ అయ్యేందుకు విద్యార్థులకు ఇదో చక్కని అవకాశంగా అధికారులు పేర్కొంటున్నారు. గతంలో జరిగిన కార్య క్రమాలకు భిన్నంగా ఈ దఫా జ్ఞానభేరి నిర్వహించాలని భావిస్తున్నారు. వర్సిటీ పరిధిలో 220 డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌ కళా శాలలు, మూడు మెడికల్‌ కాలేజ్‌లు, పలు ప్రభుత్వ కళాశాలలున్నాయి.

ఏటా వీటిల్లో లక్షమందికి పైగా విద్యార్థులు చదువులు పూర్తి చేస్తున్నారు. గుంటూరు, ప్రకాశం, కృష్ణ జిల్లాల్లో ఏఎన్‌యూ పరిధి ఉన్నది. ఈ నేపథ్యంలో జ్ఞానభేరి సభ మూడు జిల్లాల విద్యార్థులకు ఉపయోగపడేలా రూపొందించాలని భావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి జ్ఞానభేరి సమాచారం రావడంతో జాయింట్‌ కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌, ఏఎన్‌యూ వీసీ ఆచార్య రాజేంద్రప్రసాద్‌, ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఉపాధ్యక్షులు ఆచార్య పి.నరసింహారావు, ప్రొఫెసర్‌ పి.కోటేశ్వరరావు, పాలిటెక్నిల్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్‌, గుంటూరు ఆర్‌డీవో వీరబ్రహ్మంతో కలెక్టర్‌ శనివారం తన కార్యాలయంలో సమావేశమై చర్చించారు. విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు అవసరమైన తాగునీరు, ఆహారం, రవాణ సదుపాయాలు కల్పించాలన్నారు. అలానే జ్ఞానభేరి జరిగే ప్రాంగణం అంతా రెయిన్‌ ప్రూఫ్‌ షెడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు.   anu