పోస్టుల భర్తీకి పచ్చజెండా..2,379 అవుట్‌ సోర్సింగ్‌లో

Header Banner

 పోస్టుల భర్తీకి పచ్చజెండా..2,379 అవుట్‌ సోర్సింగ్‌లో

  Sun Oct 14, 2018 06:58        APNRT, Associations, Auto, అమరావతి కబుర్లు, Education, Employment, India, Telugu, World

 
 
అమరావతి : రాష్ట్రంలోని నిరుద్యోగులకు దసరా శుభవార్త. సర్వశిక్షా అభియాన్‌(ఎస్ ఎస్ ఏ)లో కొలువుల పండగకు తెరలేచింది. మొత్తం 2,379 పోస్టులను అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో భర్తీ చేసేందుకు ఉత్తర్వులు వెలువడ్డాయి. వీటిలో బోధన, బోధనేతర పోస్టులున్నాయి. నవంబరు 10 నాటికి నియామక ప్రక్రియ పూర్తిచేయాలని ఎస్‌ఎ్‌సఏ స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ ఆదేశాలు(ఆర్‌సీ-5101) జారీ చేశారు. పోస్టుల భర్తీకి జిల్లాస్థాయిలో ప్రాజెక్టు ఆఫీసర్లు, జిల్లా విద్యాధికారి, డైట్‌ ప్రిన్సిపాళ్లతో కమిటీలు వేయాలన్నారు. సీఆర్‌టీ, స్పెషల్‌ ఆఫీసర్‌(ఎస్‌వో) వంటి టీచింగ్‌ పోస్టులను 100 మార్కులకు ఆబ్జెక్టివ్‌ మోడల్‌లో రాత పరీక్ష నిర్వహించాలని, అందులో మెరిట్‌ ప్రాతిపదికగా.. జిల్లా స్థాయి రోస్టర్‌ను పాటిస్తూ భర్తీకి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలిచ్చారు. 2018 జూలై 1 నాటికి 39 ఏళ్లు మించని అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గరిష్ఠ వయోపరిమితి 44 సంవత్సరాలు, దివ్యాంగులకు 49 ఏళ్లుగా నిర్ణయించారు. నాన్‌ టీచింగ్‌ పోస్టులను కలెక్టర్‌ పర్యవేక్షణలోని జిల్లాస్థాయి కమిటీలతో భర్తీచేస్తారు.జిల్లాల వారీగా పోస్టులు: శ్రీకాకుళం(207), విజయనగరం(147), విశాఖపట్నం(242), తూర్పుగోదావరి(235), పశ్చిమగోదావరి(97), కృష్ణా(141), గుంటూరు(221), ప్రకాశం(76), నెల్లూరు(132), చిత్తూరు(483), కడప(105), అనంతపురం(117), కర్నూలు(176).


   posts