న‌వంబ‌ర్ 16 నుంచి బోట్ రేసింగ్ ప్ర‌పంచ చాంఫియ‌న్‌షిప్ పోటీలు

Header Banner

న‌వంబ‌ర్ 16 నుంచి బోట్ రేసింగ్ ప్ర‌పంచ చాంఫియ‌న్‌షిప్ పోటీలు

  Sun Oct 14, 2018 06:54        APNRT, Associations, Auto, India, Sports, Telugu, World


అమ‌రావ‌తి ః ఎఫ్‌1 హెచ్‌2వో పవర్‌ బోట్‌ రేసింగ్‌ నిర్వహణ ద్వారా ప్రపంచ దృష్టిని అమరావతి వైపు ఆకర్షింపచేయాలని సీఎం చంద్రబాబునాయడు భావిస్తున్నారని పర్యాటక శాఖ సెక్రటరీ ముఖేష్‌ కుమార్‌ మీనా తెలిపారు. బోట్‌ రేసింగ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌ నిర్వహ ణకు ఏర్పాట్లు, పనుల పర్యవేక్షణ కోసం ఏర్పాటైన సమన్వయ కమిటీ తొలి క్షేత్ర పర్యటనను శుక్రవారం నిర్వహించింది. కమిటీకి నేతృత్వం వహిస్తున్న మీనా అధికా రులతో సమావేశమయ్యారు. ఈ కమిటీలో విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరు మలరావు, కలెక్టర్‌ లక్ష్మీకాంతం, విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ నివాస్‌, ఏపీటీడీపీ ఎండీ హిమాన్షు శుక్లా తదితరులు పున్నమి ఘాట్‌లో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఎఫ్‌1హెచ్‌2వో నిర్వహణకు ప్రతి శాఖ నుంచి తాము సహకారం ఆశిస్తున్నామని మీనా సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.

ప్రకాశం బ్యారేజీ వేదికగా రాజధాని అమరావతిలో అంతర్జాతీయ క్రీడాపోటీలను నిర్వ హిసు ్తన్నామని, అమరావతిలో జరిగే పోటీల్లో 10 బృందాలకు ఒక్కో జట్టు నుంచి 50 మంది సభ్యులు చొప్పున 500మంది జల క్రీడాకారులు వస్తున్నారని వివరించారు. ఎక్కువమంది పోటీలను వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించినట్లు వివరించారు. వీఐపీ, వీవీఐపీ, జట్టు సభ్యులు, జట్టుతో వచ్చిన వారు, మీడి యాకు ప్రత్యేక గ్యాలరీలు నిర్మించాల్సి ఉంద న్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, జలవ నరులు, పర్యాటక ప్రాధాన్యంపై మూడు రోజులపాటు కార్యగోష్టి నిర్వహిస్తున్నామని, శిల్పారామం నేతృత్వంలో క్రాప్ట్స్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహి స్తామని చెప్పారు. పోటీలు జరిగే విధా నం, రేస్‌ ట్రాక్‌కు సంబంధించిన అంశాలను శుక్లా వివరించారు. నగర సుందీకరణ అంశాన్ని తన బాధ్యతగా తీసు కుంటానని మున్సిపల్‌ కమిషనర్‌ నివాస్‌ తెలపగా, జిల్లా యం త్రాంగం అంతటినీ అందు బాటులో ఉంచుతామని కలెక్టర్‌ లక్ష్మీకాంతం తెలిపారు.

ఆహ్వా నాలకు సంబంధించిన పూర్తి బాధ్యతను కలెక్టర్‌కు అప్పగిస్తూ సమావేశం నిర్ణయించింది. ఇటీ వల ముఖ్యమంత్రి రాష్ట్ర స్థాయిలో సమావేశం నిర్వ హించి దీని నిర్వహణ కోసం ప్రత్యేకంగా మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నవంబరు 16 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న బోట్‌ రేసింగ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌ పోటీలకు చేస్తున్న ఏర్పాట్లపై 30 శాఖల అధికారులతో సమీక్షించారు. సమయం తక్కువగా ఉండటం వల్ల ప్రతి ఒక్క రోజూ విలువైనదేనని, పోటీలకు చేస్తున్న ఏర్పాట్లపై నిశిత పర్యవేక్షణ జరపనున్నామని మీనా తెలిపారు. నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ అంతర్జాతీయ బోట్‌ రేసర్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పోలీసు విభాగానికి అందచేయాలన్నారు. రేసింగ్‌లో ప్రమాదం జరిగితే క్షతగాత్రులను అత్యంత వేగంగా ఆసుపత్రికి తరలించడంపై ప్రత్యేకంగా సమావేశంలో చర్చ జరిగింది.



   sports