గంట‌కు 1,000 కి.మీ. వేగం...చైనాలో కొత్త రైలు

Header Banner

గంట‌కు 1,000 కి.మీ. వేగం...చైనాలో కొత్త రైలు

  Sat Oct 13, 2018 07:29        APNRT, Associations, అమరావతి కబుర్లు, India, Technology, World


నమూనాను ఆవిష్కరించిన చైనా
అమ‌రావ‌తి ః గంటకు వెయ్యి కి.మీ. వేగంతో పరుగులుతీసే సరికొత్త హైస్పీడ్‌ రైలు నమూనాను చైనా ఆవిష్కరించింది. 2025 నాటికి ఇది ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ప్రస్తుతం చైనాలో నడుస్తున్న బుల్లెట్‌రైళ్ల గరిష్ఠవేగం గంటకు 350 కిలోమీటర్లు. దీన్ని భారీగా పెంచేందుకు ఇక్కడి పరిశోధకులు కృషిచేస్తున్నారు. ఇటీవల చెంగ్‌డూ నగరంలో ఏర్పాటుచేసిన జాతీయ సామూహిక ఆవిష్కరణలు, వ్యవస్థాపకత వారోత్సవాల్లో తాజా రైలు నమూనాను ప్రదర్శించారు. ‘‘టీ-ఫ్లైట్‌’’గాపిలుస్తున్న దీన్ని చైనా ఏరోస్పేస్‌ సైన్స్‌ అండ్‌ ఇండస్ట్రీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ అభివృద్ధి చేస్తోంది. 29.2మీ. పొడవు, 3మీ. వెడల్పుండే క్యాబిన్లు దీనిలో ఉంటాయి. ఇవి అత్యధిక ఉష్ణోగ్రత, కాంతిలను తట్టుకోగలవు. ఉపరితలానికి 100మి.మీ.ఎత్తులో తేలుతూదూసుకెళ్లే ఈ రైలులో ‘‘మ్యాగ్నెటిక్‌ లెవిటేషన్‌’’ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. క్రమంగా వెయ్యికి.మీ. వేగం అందుకుంటుందని, దీనిలోని ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందీ కలగదని పరిశోధకులు తెలిపారు.   china