జంక్ పుడ్ వ‌ద్దు...

Header Banner

జంక్ పుడ్ వ‌ద్దు...

  Fri Oct 12, 2018 14:52        APNRT, Associations, Health, India, Life Style, World


పండ్లు...ఫ‌లాలే మేలు...
ఆరోగ్యానికి పీచు పదార్థాలు ఎంతో మేలు

మ‌నిషి జీవితం వేగ‌వంత‌మైంది. బిజీ బిజీ లైఫ్‌లో ప్ర‌తిఒక్క‌రూ ఆ స‌మ‌యానికి ఇంట్లో ఉన్నా లేదా బ‌య‌ట మార్కెట్లో దొరికిన ఆహారం, లేదా ప‌దార్థాలు కొనుగోలు చేసుకుని తింటున్నాం. అందులో పోష‌క విలువ‌లు ఉన్నాయా...లేదా అనే సంగ‌తి ప‌క్క‌న పెడితే... ఆ స‌మ‌యానికి దొరిక‌న ఆహారంతో సంతృప్తి ప‌డుతున్నాం. అలాకాకుండా స‌హ‌జ సిద్ధంగా దొరికే పండ్లు, ఫ‌లాలు, ఇత‌ర పీచు ప‌దార్థాలు తింటే మనం ఆరోగ్యంగా ఉండేందుకు అవ‌కాశం ఉంటుంది. కడుపులో సరిగ్గా లేకపోతే ఆరోజంతా నరకంగానే ఉంటుంది. ఎప్పుడూ ఇలాగే కొనసాగితే అదే మలబద్ధకానికి దారితీస్తుంది. దీని గురించి పెద్దగా కంగారుపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది. పీచు పదార్థాలు : ముఖ్యంగా పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. దీనివల్ల సమస్య నుంచి త్వరగా బయట పడవచ్చు. సామాన్యంగా పౌష్ఠికాహారం గురించి పెద్దగా ఎవరూ ఆలోచించరు. జంక్‌ఫుడ్‌ ఎక్కువగా ఇష్టపడతారు. అయితే ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో 26 గ్రాముల పీచు పదార్థాలతో నిండిన ఆహారం ఉండాలి. మంచి ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం, తీసుకునే ఆహారంలో పీచుపదార్థాలు లేకపోవడం.. ఇంకా చాలా కారణాల వల్ల మలబద్ధకం సమస్య వస్తుంది. దీనికోసం మందులు వాడి ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడం ఏమాత్రం మంచిది కాదు. పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే ఈ సమస్య నుంచి ఇట్టే గట్టెక్కవచ్చు. పండ్లు, కూరగాయలు, బీన్స్‌, ధాన్యాలు అధిక శాతంలో పీచుపదార్థం కలిగి ఉన్నవే. ఆకులు, పండ్లు, పండ్లపై ఉన్న తొక్కభాగం నుంచి ఎక్కువగా పీచు పదార్థం లభిస్తుంది. ఆపిల్‌ పండులోని తొక్కను తీయకుండా తీసుకుంటేనే మంచిది. పచ్చి కూరగాయలు, ఆకుకూరలలో పీచు పదార్థమే కాదు శరీరానికి కావలసిన మెగ్నీషియం లభిస్తుంది. ఎండు ద్రాక్ష: మలబద్ధకం సమస్య నివారణకు ఎండు ద్రాక్ష బాగా ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే సహజ లక్షణాలు కండరాలను ఉత్తేజపరచి, పెద్ద పేగు ద్వారా వ్యర్థాలను బైటకు పంపేందుకు దోహదపడతాయి. ఐదు ఎండు ద్రాక్షల్లో 3 గ్రా. పీచు పదార్థం ఉంటుంది.
కాఫీ ఇతర వేడి ద్రవాలు : కాఫీ ఒత్తిడిని తగ్గించి, ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. మలబద్ధకాన్ని నిర్మూలించడంలో కాఫీ ఎంతగానో సహాయపడుతుంది. ఇతరత్రా వేడి పదార్థాలు తీసుకున్నా ఈ సమస్య నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది.
నీరు : పీచు పదార్థం ఎంత తీసుకున్నప్పటికీ, దానితో పాటు నీళ్లూ ఎక్కువగా తాగాలి. లేదంటే కడుపులో వ్యర్థాలు బయటకు రాక, కడుపునొప్పితో పాటు మలబద్ధకానికి దారితీస్తుంది. పండ్ల ముక్కల్ని నీటితో కలిపి తీసుకున్నా మంచి ఫలితం కనపడుతుంది.
రాత్రి పడుకునే ముందు గ్లాసు వేడిపాలు తాగితే జీర్ణాశయం శుభ్రపడుతుంది. భోజనం చేసిన తరువాత పీచు పదార్థం తీసుకుంటే అహారం త్వరగా జీర్ణమై మలబద్ధకం సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.   health