ర‌జ‌కులను ఎస్సీల్లో చేర్చ‌టానికి క‌ట్టుబ‌డి ఉన్నా

Header Banner

ర‌జ‌కులను ఎస్సీల్లో చేర్చ‌టానికి క‌ట్టుబ‌డి ఉన్నా

  Fri Oct 12, 2018 14:39        APNRT, అమరావతి కబుర్లు, India, Telugu, World


- సిఎం చంద్రబాబు సుముఖత
గుంటూరు ః రాష్ట్రంలో ల‌క్ష‌లాదిగా ఉన్ ర‌జ‌కుల సంక్షేమానికి త‌మ ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున ప్రాధాన్య‌త ఇస్తుంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చం్ర‌ద‌బాబునాయుడు వెల్ల‌డించారు. గుంటూరుజిల్లా ఉండవల్లిలోని గ్రీవెన్స్‌హాల్‌లో గురు వారం ఎపి రజక సంఘాల ఐక్య వేదిక అధ్యక్షులు పాతపాటి అంజిబాబు నేతృత్వంలోని 13 జిల్లాల సంఘాల అధ్యక్షులు సిఎంను కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరా రు. అనంతరం రజక సంఘ నాయకులు చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎన్టీ ఆర్‌ హయాం నుంచి రజకులు తెలుగు దేశం పార్టీకి వెన్నంటి ఉన్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఏనాడూ రజకుల అభివృద్ధికి పాటుపడిన దాఖ లాల్లేవన్నారు. రజకుల అభివృద్ధికి టిడిపి కటు ్టబడి ఉందని, రజక సమాఖ్య ఏర్పాటు చేసి రూ.70 కోట్లు కేటాయించామన్నారు. 50 ఏళ్లకే రజకులకు పింఛను అమలు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారని రజక సంఘం నేతలు తెలిపారు. రజకులను ఎస్సీల్లో చేర్చే అంశంపై సాధ్యాసాధ్యాలను గుర్తించేందుకు కమిటీని నియమించిన ఘనత టిడిపిదేన న్నారు. ర‌జ‌కుల సంక్షేమానికి ప‌లు సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని వివ‌రించారు. ఈ సమావేశంలో మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ టిడి జనార్ధన్‌ పాల్గొన్నారు.

    babu