‘అరవింద సమేత’ అద‌ర‌హో

Header Banner

‘అరవింద సమేత’ అద‌ర‌హో

  Fri Oct 12, 2018 14:25        APNRT, Associations, Auto, అమరావతి కబుర్లు, Cinemas, Entertainment, Telugu


భారీ ధర పలికిన శాటిలైట్ హక్కులు

అమ‌రావ‌తి ః ‘అరవింద సమేత’ ఫీవర్ తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది. సినిమా ఎలా ఉండబోతోందోనని ప్రేక్షకులు, సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారోనన్న చిత్రబృందం ఉత్కంఠకు నిన్న(గురువారం)టితో తెరపడింది. ఈ సినిమా తొలి షో నుంచే మంచి సక్సెస్ టాక్‌తో నడుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా శాటిలైట్ హక్కుల కోసం టీవీ ఛానల్స్ పోటీ పడినట్టు సమాచారం.

ఈ పోటీ నడుమ భారీ ధరకు శాటిలైట్ హక్కులు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ఈ సినిమా హక్కులు రూ.23.50 కోట్ల బిజినెస్ చేసిపెట్టాయని సమాచారం. ఎన్టీఆర్ సినిమాకు ఈ స్థాయిలో శాటిలైట్ హక్కులు పలకడం ఇదే మొదటిసారని టాక్. ఈ సినిమా ఓవర్సీస్‌లోనూ అద్భుతమైన వసూళ్లు రాబడుతోందట. దీంతో ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డ్‌లను బ్రేక్ చేయడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.   aravinda