చంద్రబాబు నాయకత్వం భేష్ ః ఎన్‌కే సింగ్‌

Header Banner

చంద్రబాబు నాయకత్వం భేష్ ః ఎన్‌కే సింగ్‌

  Fri Oct 12, 2018 11:39        APNRT, అమరావతి కబుర్లు, India, Telugu, World


విజ‌య‌వాడ ః విభజన నేపథ్యంలో రాష్ట్రం ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని ఎన్‌కే సింగ్‌ పేర్కొన్నారు. నూతన రాజధాని అమరావతి నిర్మాణం, రాష్ట్రంలో ఆర్థిక వృద్ధి రేటు పెరుగుదల, నీటి వనరులకు సమప్రాధాన్యం, నదుల అనుసంధానం, పోలవరం ప్రాజెక్టు వంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం పనితీరును, చంద్రబాబు నాయకత్వాన్ని ప్రశంసించారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో రాష్ట్రం మంచి పురోగతి సాధిస్తున్నట్లు తెలిపారు. టెక్నాలజీ, నాలెడ్జ్‌ ఎకానమీ, ఐటీ రంగాల్లో రాష్ట్రం ప్రత్యేక గుర్తింపు సాధించిందన్నారు. సీఎం డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని.. అవకాశం ఉన్నంత వరకు రాష్ట్రానికి న్యాయం చేస్తామని చెప్పారు. సమావేశంలో 15వ ఆర్థిక సంఘం సభ్యులు డాక్టర్‌ అశోక్‌ లహిరి, డాక్టర్‌ అనూప్‌ సింగ్‌, శక్తికాంత్‌దా్‌స, ప్రొఫెసర్‌ రమేశ్‌చంద్‌, ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శులు ఎం.రవిచంద్ర, పీయూష్‌ కుమార్‌, ప్రత్యేక కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.   cm 1