సహాయ పునరావాస చర్యలపై అందరూ కదలాలి

Header Banner

సహాయ పునరావాస చర్యలపై అందరూ కదలాలి

  Fri Oct 12, 2018 11:36        APNRT, అమరావతి కబుర్లు, India, Telugu, World


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అమ‌రావ‌తి ః సిక్కోలు ప్రజలకు తీవ్ర ఆపద వచ్చిందని, సహాయ పునరావాస చర్యలపై అందరూ కదలాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. శుక్రవారం తుఫాన్ సహాయక చర్యలపై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎంత తొందరగా సాధారణస్థితి తెస్తారనేదానిపై పోటిబడాలని అన్నారు. యుద్ధప్రాతిపదికన గండ్లు పూడ్చాలని, రోడ్లకు మరమ్మతులు చేయాలని ఆదేశించారు. అలాగే అన్ని మండలాల్లో కమ్యూనికేషన్లు పునరుద్దరించాలని తెలిపారు. ప్రతి మండలానికి ఒక సబ్ కలెక్టర్ బాధ్యత తీసుకోవాలన్నారు. పంటనష్టం, ఆస్తినష్టంపై అంచనాలను రూపొందించాలని చెప్పారు. సాధారణస్థితికి వచ్చే వరకు అధికారులకు సెలవులు లేవని స్పష్టం చేశారు. తితలీ తుఫాన్ కదలికలపై తమ అంచనాలే నిజం అయ్యాయని, పొరుగు రాష్ట్రం కన్నా తామే సరిగ్గా అంచనా వేశామని చంద్రబాబు చెప్పుకొచ్చారు
తలీ తుపాను ప్రభావంతో జిల్లాలోని 169 గ్రామాలు అతలాకుతలమయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు 12 మండలాల్లో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. తుఫాను ప్రభావంతో లక్షలాది ఎకరాల్లో వరిపంట నీటమునిగింది. ఉద్దానంలో కొబ్బరి, అరటి, జీడిమామిడి తోటలకు తీవ్రనష్టం వాటిల్లింది. బలమైన గాలులకు 17 మండలాల్లో 7 వేల విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. 110 బృందాలు, 2200 మంది విద్యుత్‌ సిబ్బంది పనిచేస్తున్నారని, ఆదివారం నాటికి విద్యుత్‌ను పునరుద్ధరిస్తామని ఈపీడీసీఎల్‌ సీఎండీ తెలిపారు.

    cm