‘యన్‌టీఆర్’ బయోపిక్‌పై భారీ అంచ‌నాలు

Header Banner

‘యన్‌టీఆర్’ బయోపిక్‌పై భారీ అంచ‌నాలు

  Thu Oct 11, 2018 11:51        APNRT, అమరావతి కబుర్లు, India, World

 

అమ‌రావ‌తి ః ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ‘యన్‌టీఆర్’ బయోపిక్‌పై భారీ క్రేజ్ ఉంది ప్రేక్షకుల్లో. తమ అభిమాన నటుడు ఎన్టీఆర్‌తో సహా ఆనాటి నటీనటుల రూపాలను వెండితెరపై చూడాలని కుతూహలంగా ఉన్నారు నందమూరి అభిమానులు. అయితే ఈ బయోపిక్ విషయంలో రోజుకో సర్‌ప్రైజ్ బయటకు వదులుతూ ప్రేక్షకులను ఖుషీ చేస్తోంది ‘యన్‌టీఆర్’ చిత్ర యూనిట్. దీంతో ‘యన్‌టీఆర్’ బయోపిక్ రైట్స్ విషయంలో పోటీ పెరిగిందని తెలుస్తోంది.


‘యన్‌టీఆర్’ బయోపిక్ రైట్స్ దక్కించుకోవడానికి చాలా సంస్థలు ముందుకొస్తున్నాయట. ఈ రైట్స్ విషయంలో ఇప్పటికే ఓ సంస్థ 10 కోట్ల రూపాయలు ఆఫర్ చేసిందని సమాచారం. అయితే సినిమాకున్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమా హక్కులను ఇంకా ఎక్కువ ధరకు అమ్మాలనే యోచనలో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 12 కోట్ల వరకు ఓవర్‌సీస్ హక్కుల ద్వారా రావాలని భావిస్తున్నారట. హక్కుల విషయంలోనే ఈ రేంజ్‌లో ఉందంటే.. ఇక సినిమా విడుదలైతే ఇంకెన్ని కలెక్షన్ల సునామీలు సృష్టిస్తుందో చూడాలి.


   ntr