గూగుల్‌ పిక్సెల్‌ 3, 3 ఎక్స్‌ఎల్‌ ...ఆండ్రాయిడ్‌ 9.0 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ రూ.71,000-92,000

Header Banner

గూగుల్‌ పిక్సెల్‌ 3, 3 ఎక్స్‌ఎల్‌ ...ఆండ్రాయిడ్‌ 9.0 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ రూ.71,000-92,000

  Thu Oct 11, 2018 11:45        APNRT, అమరావతి కబుర్లు, Business, Telugu

ఖరీదైన పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్లలో మూడోతరాన్ని గూగుల్‌ ఆవిష్కరించింది. రూ.71,000 నుంచి రూ.92,000 ధరల శ్రేణిగా నిర్ణయించిన పిక్సెల్‌ 3, పిక్సెల్‌ 3 ఎక్స్‌ఎల్‌ మోడళ్లు దేశీయ విపణిలో నవంబరు 1 నుంచి లభిస్తాయని గూగుల్‌ ప్రకటించింది.  న్యూయార్క్‌లో జరిగిన కార్యక్రమంలో వీటితో పాటు పిక్సెల్‌ స్లేట్‌ టాబ్లెట్‌, పిక్సెల్‌బుక్‌ ల్యాప్‌టాప్‌, గూగుల్‌ హోమ్‌ హబ్‌లను కూడా గూగుల్‌ ఆవిష్కరించింది. దేశీయంగా పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ (64 జీబీ)ని రూ.45,499కి విక్రయిస్తామని సంస్థ తెలిపింది.

పిక్సెల్‌3: 64 జీబీ ధర రూ.71,000 కాగా, 128 జీబీ ధర రూ.80,000 
పిక్సెల్‌ 3ఎక్స్‌ఎల్‌: 64 జీబీ ధర రూ.83,000, 128 జీబీ రూ.92,000

పిక్సెల్‌ 3 ప్రత్యేకతలివీ: అల్యూమినియం ఫ్రేమ్‌కు గొరిల్లా గ్లాస్‌ 5 అమర్చిన ఈ ఫోన్‌లో నానోసిమ్‌తో పాటు ఇసిమ్‌ అమర్చుకోవచ్చు. మీటరున్నర లోతు వరకు 30 నిమిషాల పాటు నీటిలో ఉన్నా, తట్టుకుంటుందని సంస్థ తెలిపింది. 5.5 అంగుళాల పీ-ఓఎల్‌ఈడీ తెర, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 845 చిప్‌సెట్‌, ఆక్టాకోర్‌ (4*2.5 గిగాహెర్ట్జ్‌ క్రైయో 385 గోల్డ్‌, 4శ్రీ1.6 గిగాహెర్ట్జ్‌ క్రైయో 385 సిల్వర్‌) ప్రాసెసర్‌, ఆండ్రెనో 360 గేమింగ్‌ ప్రాసెసర్‌, 4జీబీ ర్యామ్‌ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 9.0 (పై) ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది. మెమొరీకార్డుకు వీలుండదు. డ్యూయల్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌ కలిగిన 12.2 మెగాపిక్సెల్‌ కెమేరా వెనుకవైపు, సెల్ఫీకోసం ముందువైపు రెండు 8 మెగాపిక్సెల్‌ కెమేరాలు, వేలిముద్ర సెన్సార్‌, 2915 ఎంఏహెచ్‌ బ్యాటరీ కలిగిన ఈ ఫోన్‌ 3 రంగుల్లో లభించనుంది. 
పిక్సెల్‌ 3ఎక్స్‌ఎల్‌: 6.3 అంగుళాల తెర, 3430 బ్యాటరీ మాత్రమే తేడా.   cell