మైసూరులో దసరా ఉత్సవాలు ప్రారంభం

Header Banner

మైసూరులో దసరా ఉత్సవాలు ప్రారంభం

  Thu Oct 11, 2018 11:40        APNRT, అమరావతి కబుర్లు, India, World


అమ‌రావ‌తి ః ప్రపంచ ప్రఖ్యాత మైసూరు దసరా ఉత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం చాముండి కొండలపై ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ అధ్యక్షురాలు సుధా నారాయణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జలప్రళయానికి గురైన కొడగు జిల్లాలో వరద బాధితులకు పక్కా ఇళ్ల నిర్మాణాన్ని రూ.25 కోట్ల వ్యయంతో చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సుధా నారాయణమూర్తి ఇదే వేదికపై ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని ముఖ్యమంత్రి కుమారస్వామి రైతులకు విజ్ఞప్తిచేశారు. ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.   mysore