నవంబర్‌ 3న తానా 22వ మ‌హాస‌భ‌ల సన్నాహక కార్యక్రమం

Header Banner

నవంబర్‌ 3న తానా 22వ మ‌హాస‌భ‌ల సన్నాహక కార్యక్రమం

  Thu Oct 11, 2018 11:37        APNRT, Associations, అమరావతి కబుర్లు, India, Telugu, World


తానా అధ్యక్షుడు సతీశ్‌ వేమన
విజ‌య‌వాడ ః ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 22వ మహాసభల సన్నాహాక కార్యక్రమం నవంబర్‌ 3న వర్జీనియాలోని హయత్‌ రీజెన్సీ హోటల్‌ హెరండన్‌లో ఉంటుందని తానా అధ్యక్షుడు సతీశ్‌ వేమన తెలిపారు. వాషింగ్టన్‌ డీసీ, వర్జీనియా మేరిల్యాండ్‌ ప్రాంతాల తెలుగు వారితో తానా అధ్యక్షుడు సతీశ్‌ సోమవారం సమావేశమయ్యారు. సన్నాహక కార్యక్రమ ఏర్పాట్లపై చర్చించారు. 2019 జులై 4,5,6 తేదీల్లో తానా 22వ మహాసభలు జరగనున్నట్లు ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో డాక్టర్‌ మూల్పూరి వెంకటరావు, డాక్టర్‌ హేమ ప్రసాద్‌, నరేన్‌ కొడాలి, తానా కోశాధికారి రవి పొట్లూరి తదితరులు పాల్గొన్నారు.



   telugu