ఎన్ ఆర్ ఐ సాధికారిత మంత్రి కొల్లు ర‌వీంద్ర‌కు స‌న్మానం

Header Banner

ఎన్ ఆర్ ఐ సాధికారిత మంత్రి కొల్లు ర‌వీంద్ర‌కు స‌న్మానం

  Wed Oct 10, 2018 14:33        APNRT, అమరావతి కబుర్లు, India, Telugu, World

 

అమ‌రావ‌తి ః ఎపి ఎన్ ఆర్ టి ద్వారా ప్ర‌పంచంలోని తెలుగు ప్ర‌జ‌ల‌కు అందిస్తున్న సేవ‌ల‌కు గాను రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడలు, న్యాయ, ఎన్‌ఆర్‌ఐ సాధికారిత, సేవలు శాఖ మంత్రి కొల్లు రవీంద్రను ప‌లువురు ప్ర‌ముఖులు ఘ‌నంగా స‌త్క‌రించారు. ఫిలాంత్రోఫిక్‌ సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్‌ అద్దంకి రాజాయోనా మంగళవారం మర్యాద పూర్వకంగా మంత్రి కొల్లు ర‌వీంద్ర‌ను అమ‌రావ‌తిలో క‌లిశారు. ఎపి ఎన్ ఆర్ టి ద్వారా ప్ర‌పంచంలోని తెలుగు ప్ర‌జ‌ల‌కు, ప్ర‌వాసాంధ్రుల‌కు అందుతున్న సేవ‌లు ్ర‌ప‌శంస‌నీయ‌మ‌ని కొనియాడారు. ఎపి ఎన్ ఆర్‌టిని ముందుకు న‌డిపిస్తూ ప్ర‌పంచంలోని ప‌లు దేశాలలో ఉన్న ్ర‌ప‌వాసాంధ్రుల‌కు పున‌రావాసం, ఉపాధి అవ‌కాశాల క‌ల్ప‌న‌కు ప్రాధాన్య‌త ఇస్తున్న ఎపి ఎన్ ఆర్ టి డైర‌క్ట‌ర్ చ‌ప్పిడి రాజ‌శేఖ‌ర్‌ను కూడా ప్రముఖ సంస్థ ఫిలాంత్రోఫిక్‌ సొసైటీ వ్య‌వ‌స్థాప‌కులు డాక్ట‌ర్ అద్దంకి రాజాయోనా అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో సామాజిక ఉద్యమ నాయకుడు మేదర సురేష్‌, టిడిపి నాయకులు నానాజీ పాల్గొన్నారు.   minister