కేంద్రం తీరు మారాల్సిందే...

Header Banner

కేంద్రం తీరు మారాల్సిందే...

  Wed Oct 10, 2018 07:24        APNRT, అమరావతి కబుర్లు, Telugu


లేక‌పోతే ఉధృత ఆందోళ‌న‌లు
ఘాటు లేఖ‌కు చంద్ర‌బాబు స‌మాయాత్తం
అమ‌రావ‌తి ః వెనకబడిన జిల్లాలకు సాయం చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి ఘాటుగా లేఖ రాయాలని నిర్ణయించారు. అప్పటికీ కేంద్రం నుంచి స్పందన రాకపోతే వచ్చే వారం పార్లమెంటు సభ్యుల బృందాన్ని దిల్లీకి పంపాలని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో మంగళవారం రాత్రి నిర్వహించిన సమావేశం సందర్భంగా అన్నారు. వెనకబడిన జిల్లాలకు ఇదివరకే ఇచ్చిన రూ.350 కోట్లు మళ్లీ వెనక్కి తీసుకోవడంపై కేంద్రానికి లేఖ రాసినా ఇప్పటికీ కిమ్మనలేదని, ఇప్పుడు తెలంగాణకు సాయం చేసి రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రానికి ఘాటుగా లేఖ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న సహాయ నిరాకరణపై వైకాపా, జనసేన స్పందించకపోగా.. కేంద్రంపై పోరాడుతున్న ప్రభుత్వంపై నిందలు వేయడాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. కేంద్ర వైఖరిలో మార్పు రాకపోతే ఆందోళన ఉద్ధృతం చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.   cm