బెజవాడలో విస్తృత ఏర్పాట్లు

Header Banner

బెజవాడలో విస్తృత ఏర్పాట్లు

  Wed Oct 10, 2018 07:12        APNRT, అమరావతి కబుర్లు, Devotional, India, Telugu, Worldస్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు
శ్రీశైలంలో శైలపుత్రి అలంకారం.. భృంగి వాహనసేవ
అమ‌రావ‌తి ః దసరా ఉత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. తొలిరోజైన బుధవారం స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఉదయం 9 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతి ఇస్తారు. ఈ ఏడాది తొలిసారిగా శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల నుంచి అమ్మవారికి సారె తీసుకొస్తున్నారు. మూలా నక్షత్రం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరుఫున సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. మరోవైపు, ప్రముఖ శైవక్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైలంలో తొలిరోజు శైలపుత్రిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. సాయంత్రం భ్రమరాంబికా మల్లికార్జున స్వామివార్లకు భృంగివాహన సేవను నిర్వహిస్తారు.   dasara