గురజాడ జీవితం స్పూర్తిదాయ‌కం

Header Banner

గురజాడ జీవితం స్పూర్తిదాయ‌కం

  Tue Oct 09, 2018 15:17        APNRT, Associations, అమరావతి కబుర్లు, India, Telugu, World


విజ‌య‌వాడ ః గుర‌జాడ అప్పారావు గారి జీవితం నేటి త‌రానికి ఆద‌ర్శ‌నీయ‌మ‌ని గుర‌జాడ సాహితీ పౌండేష‌న్ (యుఎస్ ఎ) ఇంట‌ర్నేష‌న‌ల్ రాష్ట్ర స‌హాయ కార్య‌ద‌ర్శి య‌డ‌వ‌ల్లి శ్రీ‌నివాస‌రావు అన్నారు. 6-10-2018న కృష్ణాజిల్లా ఆగిరిప‌ల్లి మండ‌లం ఈద‌ర ్ర‌గామంలోని ధ‌ర‌ణి ఇంగ్లీషు, తెలుగు మీడియం పాఠ‌శాల‌ల‌లో గుర‌జాడ పౌండేష‌న్ కృష్ణాజిల్లా క‌మిటీ ఆధ్వ‌ర్యంలో గుర‌జాడ అప్పారావు క‌న్యాశుల్కం 126 సంవ‌త్స‌రాలైన సంద‌ర్భంగా విద్యార్థినీ విద్యార్థుల‌కు క్విజ్‌, వ్యాస‌ర‌చ‌న‌, గేయాల పోటీలు జ‌రిగాయి. విజేత‌ల‌కు పాఠ‌శాల ప్రిన్సిపాల్ మ‌ల్లెల శ్రీ‌నివాస‌రావు అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన బహుమ‌తి ప్ర‌ధానోత్స‌వ స‌భ‌కు ముఖ్యఅతిథిగా య‌డ‌వ‌ల్లి శ్రీ‌నివాస‌రావు హాజ‌రై మాట్లాడారు. స‌మాజంలో నెల‌కొన్న రుగ్మ‌త‌ల‌ను రూపుమాప‌టానికి గుర‌జాడ అప్పారావు ఇతోధికంగా కృషిచేశార‌ని గుర్తుచేశారు. గుర‌జాడ సాహితీ పౌండేష‌న్ (యుఎస్ ఎ) ఇంట‌ర్నేష‌న‌ల్ జిల్లా కార్య‌ద‌ర్శి పాల‌డుగుల శివ‌నాగ‌రాజారావు మాట్లాడుతూ గుర‌జాడను స్ఫూర్తిగా తీసుకుని జీవితంగా ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరుకోవాల‌ని కోరారు. అనంత‌రం మ‌ల్లెల శ్రీ‌నివాస‌రావు, పాఠ‌శాల క‌ర‌స్పాండెంట్ మ‌ల్లెల శివ‌సునీత మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగున్న ప్ర‌తిభ‌ను వెలికి తీయ‌టానికి ఇలాంటి కార్య్ర‌క‌మాలు దోహ‌ద‌ప‌డ‌తాయ‌న్నారు. అనంత‌రం విజేత‌ల‌కు బ‌హుమ‌తి ప్ర‌ధానం జ‌రిగింది. విద్యార్థులు నిర్వ‌హించిన సాం్క‌సృక కార్య్ర‌క‌మాలు ఆహుతుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి.   gurajada