ప్రపంచ ఛాంపియనయ్యా ..హిమ

Header Banner

ప్రపంచ ఛాంపియనయ్యా ..హిమ

  Sat Sep 29, 2018 16:52        Sports, Telugu

ఐఏఏఎఫ్‌ అండర్‌-20 అథ్లెటిక్స్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో హిమ దాస్‌ ప్రదర్శన ఓ సంచలనం. ఆ టోర్నీ 400 మీటర్ల పరుగులో స్వర్ణం గెలిచి అబ్బుర పరిచింది హిమ. ఆ ప్రదర్శనతో హిమ కెరీరే మారిపోయింది. భారత్‌లో ఇప్పుడామె ఒక స్టార్‌ అథ్లెట్‌. కోట్లాది మందికి స్ఫూర్తి. ఐతే హిమ జీవితాన్ని మార్చిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆమె పాల్గొంటున్న విషయం తల్లిదండ్రులకు తెలియనే తెలియదట. ఈ సంగతి ఆమె వాళ్లకు చెప్పనే లేదట. ‘‘నేను అంత పెద్ద టోర్నమెంట్లో పాల్గొంటున్నానని మా అమ్మానాన్నలకు చెప్పలేదు. అది చిన్న టోర్నీ అని చెప్పా. వాళ్లు నేరుగా టీవీలో నా ప్రదర్శనను చూశారు. ఈవెంట్‌ ముగిశాక నా గదికి చేరుకుని మా నాన్నకు ఫోన్‌ చేశా. ఆయన పడుకోబోతున్నట్లు చెప్పారు. నేను ప్రపంచ ఛాంపియన్‌ అయితే మీరు పడుకుంటున్నారా అని అడిగా. దానికాయన ఉదయం చూద్దాంలే అన్నారు’’ అని హిమ వెల్లడించింది.   ప్రపంచ ఛాంపియనయ్యా ..హిమ