రాగి పాత్రలో నీరు మీ ఆరోగ్యం తీరు మారు

Header Banner

రాగి పాత్రలో నీరు మీ ఆరోగ్యం తీరు మారు

  Sat Sep 29, 2018 15:56        Health, Telugu

కొన్ని దశాబ్దాల క్రితం మనుషులు ఆరోగ్యంగా ఉండేవారు. ప్రస్తుతం కనిపిస్తున్న ఆరోగ్య సమస్యలు వారిని పెద్దగా బాధించేవి కావు. దీనికి కారణం వారి జీవనవిధానమే అంటున్నారు నిపుణులు. అప్పట్లో ఎక్కువగా రాగి, ఇత్తడి పాత్రలు వాడడం వలనే వారి ఆరోగ్యం అంత బేషుగ్గా ఉండేదని వారు అభిప్రాయపడుతున్నారు. రాగి పాత్రలో మూడు గంట‌లపాటు నీటిని నిల్వ ఉంచినట్లయితే ఆ నీటిలోని క్రిములు నశిస్తాయి. దీంతో ఆ నీరు ప‌రిశుభ్రంగా మారుతుంది. ఇత్త‌డి పాత్ర‌ల‌ను జింక్‌, అలాయ్ మిశ్ర‌మంతో త‌యారు చేస్తారు. జింక్ వ‌ల్ల మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతంది. అందుక‌ని ఇత్త‌డి పాత్ర‌ల్లో నీటిని తాగ‌వ‌చ్చు. లేదా ఆ పాత్రల్లో వంట చేసుకుని తిన‌వ‌చ్చు. రాగి పాత్ర‌ల్లో నిల్వ ఉంచిన నీటిని తాగ‌డం వ‌ల్ల అసిడిటీ, అజీర్ణం, డ‌యేరియా, కామెర్లు, కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. అధిక బ‌రువు సమస్య త‌గ్గిపోతుంది. గుండె స‌మ‌స్య‌లు రావు. క్యాన్స‌ర్ క‌ణాలు న‌శిస్తాయి. థైరాయిడ్ గ్రంథి ప‌నితీరు మెర‌గ‌వుతుంది. ర‌క్త‌హీన‌త పోతుంది. హైబీపీ త‌గ్గుతుంది. ఇప్పటికైనా రాగి, ఇత్తడి పాత్రలు వాడడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చని వారు చెబుతున్నారు.



   రాగి పాత్రలో నీరు మీ ఆరోగ్యం తీరు మారు