యాంటీబయాటిక్స్‌తో ముప్పు

Header Banner

యాంటీబయాటిక్స్‌తో ముప్పు

  Sat Sep 29, 2018 14:54        Health, Telugu

దగ్గు, జలుబు, జ్వరం మొదలుకొని పలు అనారోగ్య సమస్యలకు యాంటీబయాటిక్స్‌నే వాడుతున్నారు. వీటిని విచ్చలవిడిగా వాడటం వల్ల వ్యాధికారక సూక్ష్మజీవులు వాటిని తట్టుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటున్నాయని ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలింది. అయితే, యాంటీబయాటిక్స్‌తో మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుందని, వీటిని ఎక్కువగా వాడటం వల్ల శరీరంలోని వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుందని వెస్టర్న్‌ రిసర్వ్‌ యూనివర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. యాంటీబయాటిక్స్‌ను ఎక్కువగా వాడటం వల్ల శరీరంలో వ్యాధినిరోధక కణాలను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా నాశనం అవుతుందని తమ అధ్యయనంలో తేలిందని పరిశోధక బృందంలోని భారత సంతతికి చెందిన నటరాజన్‌ భాస్కరన్‌, పుష్ప పాండ్యన్‌ వెల్లడించారు.   యాంటీబయాటిక్స్‌ తో ముప్పు