జర్మనీలో వైభవంగా వినాయక చవితి వేడుకలు

Header Banner

జర్మనీలో వైభవంగా వినాయక చవితి వేడుకలు

  Sat Sep 29, 2018 14:38        Devotional, Telugu

జర్మనీలోని కొలోన్ తెలుగు వేదిక సంఘం ఆధ్వర్యంలో వినాయకచవితి వేడుకలు వైభవంగా జరిగాయి. కొలోన్‌ నగరంలో సెప్టెంబర్ 15న ప్రవాస తెలుగు ప్రజలు గణేశ్‌ ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. సుమారు 200 మంది స్థానిక తెలుగువారు కుటుంబ సమేతంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల్లో చిన్నాపెద్దా అంతా కలిసి పలు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలతో పాటు క్విజ్‌ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. వారి నృత్యాలు ఆహూతులను ఎంతగానో అలరించాయి. రుచికరమైన తెలుగు వంటకాలను వేడుకలకు విచ్చేసిన అతిథుల కోసం ఏర్పాటు చేశారు. ఈ వేడుకల సందర్భంగా నిర్వహించిన ఫ్యామిలీ క్రికెట్‌ టోర్నమెంట్‌ విజేతలకు ట్రోఫీని అందజేశారు. వినాయక నిమజ్జనం కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని నృత్యాలతో సందడి చేశారు. వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సహాయ, సహకారాలు అందించిన పలు సంస్థలతో పాటు కళాకారులకు, వేడుకల్లో పాల్గొన్న అందరికీ తెలుగు వేదిక సంఘం కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.   జర్మనీలో వైభవంగా వినాయక చవితి వేడుకలు