అమెరికా బాక్సాఫీసు వద్ద ‘నవాబ్‌’ గర్జన

Header Banner

అమెరికా బాక్సాఫీసు వద్ద ‘నవాబ్‌’ గర్జన

  Sat Sep 29, 2018 14:24        Cinemas, Telugu

ప్రముఖ దర్శకుడు మణిరత్నం ‘నవాబ్‌’ చిత్రంతో తన మార్కును మరోసారి ప్రేక్షకులకు చూపించారు. చక్కటి కథతో రూపొందించిన ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమాలో నటీనటులు తమ పాత్రల్లో ఒదిగిన తీరు చక్కగా ఉందని విమర్శకులు ప్రశంసించారు.

అరవింద స్వామి, శింబు, జ్యోతిక, అరుణ్‌ విజయ్‌, ఐశ్వర్యా రాజేశ్‌, విజయ్‌ సేతుపతి, ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, అదితి రావు హైదరి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. మణిరత్నం, శివ ఆనంది నిర్మించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ సమర్పించింది. ఎ.ఆర్‌. రెహమాన్‌ బాణీలు అందించారు. మాఫియా కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది.

ఈ సినిమా అమెరికా బాక్సాఫీసు వద్ద గర్జించిందని సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. మణిరత్నం మళ్లీ మ్యాజిక్‌ చేశారని అన్నారు. బుధవారం నిర్వహించిన ప్రీమియర్స్‌లో 79,258 డాలర్లు, గురువారం (తొలిరోజు) 87,970 డాలర్లు, మొత్తం 167,228 డాలర్లు (రూ.1.21 కోట్లు) రాబట్టిందని తెలిపారు. ఒక్క రోజులో ఇంత మంచి కలెక్షన్స్‌ రాబట్టడం విశేషమని పేర్కొన్నారు.

 
 
 

 


   అమెరికా బాక్సాఫీసు వద్ద ‘నవాబ్‌’ గర్జన