పర్యాటకులకు సౌదీ సరికొత్త వీసా

Header Banner

పర్యాటకులకు సౌదీ సరికొత్త వీసా

  Wed Sep 26, 2018 22:29        Gulf News, Telugu

 వీసా జారీ ప్రక్రియలో ఎప్పటికప్పుడు నూతన విధానాలను తీసుకొచ్చే గల్ఫ్ దేశం సౌదీఅరేబియా మరో సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి పర్యాటకులకు ఎలక్ట్రానిక్ వీసాలను జారీ చేయనుంది. వివిధ క్రీడా కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలను వీక్షించడానికి సౌదీకి వచ్చే పర్యటకులకు ఈ వీసాలను జారీ చేయనున్నారు. వివిధ వనరుల ద్వారా ఆదాయం పొందాలని భావిస్తున్న సౌదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది డిసెంబర్‌ 15న ప్రారంభకానున్న ‘ సౌదీ అద్ దిరియాహ్ ఈ ప్రిక్స్ రేస్’ నుంచి ఈ నూతన ఎలక్ట్రానిక్ వీసాలను జారీ చేయనున్నామని సౌదీ జనరల్ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు మంగళవారం ప్రకటించారు.   sarikotta visa