పాదరక్షల ఖరీదు రూ.123 కోట్లు

Header Banner

పాదరక్షల ఖరీదు రూ.123 కోట్లు

  Wed Sep 26, 2018 22:11        Business, Telugu

దుబాయ్‌: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాదరక్షల జతను బుధవారం నాడిక్కడ ఆవిష్కరించనున్నారు. మేలిమిబంగారం...మేలుజాతి వజ్రాలు పొదిగి చేసిన ఈ పాదరక్షల జత ఖరీదెంతో తెలుసా! ఏకంగా రూ.123 కోట్లు...ఔను! అక్షరాలా నూట ఇరవై మూడు కోట్ల రూపాయలు.  ప్రపంచప్రఖ్యాతిగాంచిన  ‘బుర్జ్‌దుబాయ్‌’లో వీటిని ఆవిష్కరించనున్నారు. మిలమిలాడే మేలిమి బంగారం, మేలుజాతి వజ్రాలతో వీటి తయారీకి ఏకంగా తొమ్మిదినెలల వ్యవధి పట్టింది.  యుఏఈకి చెందిన ప్రఖ్యాత బ్రాండ్‌ ‘జాదా దుబాయ్‌’ ...ప్రముఖ ఆభరణాల సంస్థ ‘ప్యాషన్‌ జువెలర్స్‌’తో కలిసి ఈ పాదరక్షలను తీర్చిదిద్దారు. వజ్రపు కాంతులీనే పసిడి పాదరక్షలను బుధవారం లాంఛనంగా ఆవిష్కరించిన తర్వాత ....ఇకపై ఆసక్తి ఉన్న వారు ఇచ్చే పాదాల కొలతల మేరకు ఆర్డరుపై తయారు చేసి అందచేయనున్నట్లు ‘జాదా దుబాయ్‌’ సహవ్యవస్థాపకురాలు, డిజైనరు అయిన మరియా మజారి తెలిపారు.    cheppals