కోహ్లి, చాను లకు ఖేల్‌రత్న

Header Banner

కోహ్లి, చాను లకు ఖేల్‌రత్న

  Wed Sep 26, 2018 00:00        Sports, Telugu

 టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, మహిళా వెయిట్‌ లిఫ్టర్‌ మీరాభాయి చానులు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతులు మీదుగా ప్రతిష్టాత్మక రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న అవార్డు అందుకున్నారు. వీరేగాక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళల డబుల్స్‌ షట్లర్‌ సిక్కిరెడ్డి అర్జున అవార్డును, ఎ. శ్రీనివాసరావు ద్రోణాచార్య అవార్డు లను రాష్ట్రపతి చేతులమీదుగా అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం మంగళవారం జరిగింది. వివిధ క్రీడల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు ఇంతకుముందే క్రీడా అవార్డుల కమిటీ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అలాగే జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాతో పాటు మరో 20 మంది క్రీడాకారులు అర్జున అవార్డును అందుకున్నారు. ఖేల్‌ రత్న పుర స్కారం పొందిన వారికి పతకం, ప్రశంసా పత్రంతో పాటు రూ.7 లక్షల 50 వేలు... 'అర్జున' అవార్డు లకు అర్జునుడి ప్రతిమతోపాటు రూ.5 లక్షల నగదు పురస్కారం అందజేశారు. వాస్తవానికి జాతీయ క్రీడల దినోత్సవం (ఆగస్టు 29) రోజునే ఈ అవా ర్డుల ప్రదానోత్సవం జరగాలి. కానీ ఏషియన్‌ గేమ్స్‌ నేప థ్యంలో ఈ కార్యక్రమాన్ని మంగళవారం (సెప్టెంబర్‌ 25) నిర్వహించారు. ఇంకా ద్రోణా చార్య, ధ్యాన్‌చంద్‌ అవార్డులను కూడా అందజేశారు.

రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డు గ్రహితలు: విరాట్‌ కోహ్లీ(క్రికెట్‌), మీరాభాయి చాను (వెయిట్‌లిఫ్టింగ్‌)
అర్జున అవార్డు గ్రహితలు : నేలకుర్తి సిక్కిరెడ్డి(బ్యాడ్మింటన్‌), హిమదాస్‌, నీరజ్‌ చోప్రా, జిన్సన్‌ జాన్సన్‌ (అథ్లెటిక్స్‌), స్మృతి మంధాన (క్రికెట్‌), సవిత పూనియా (హాకీ), రాహీ సర్నో బాత్‌, శ్రేయసి సింగ్‌, అంకుర్‌ మిట్టల్‌ (షూటింగ్‌), మనిక బాత్రా (టేబుల్‌ టెన్నిస్‌), పూజా కడియాన్‌ (వుషు), రోహన్‌ బోపన్న (టెన్నిస్‌), జి. సత్యన్‌ (టేబుల్‌ టెన్నిస్‌), సతీశ్‌ కుమార్‌ (బాక్సింగ్‌), మన్‌ప్రీత్‌ సింగ్‌ (హాకీ), సుమీత్‌ (రెజ్లింగ్‌), రవి రాథోడ్‌ (పోలో), శుభాంకర్‌ శర్మ (గోల్ఫ్‌), అంకుర్‌ ధామ (పారాథ్లెటిక్స్‌), మనోజ్‌ సర్కార్‌ (పారా బ్యాడ్మింటన్‌). 
ద్రోణాచార్య అవార్డు గ్రహితలు : ఎస్‌.ఎస్‌.పన్ను (అథ్లెటిక్స్‌), సి.ఎ.కుట్టప్ప (బాక్సింగ్‌), విజరు శర్మ (వెయిట్‌ లిఫ్టింగ్‌), ఎ. శ్రీనివాసరావు (టేబుల్‌ టెన్నిస్‌).
ధ్యాన్‌చంద్‌ అవార్డు గ్రహీతలు : సత్యదేవ్‌ ప్రసాద్‌ (ఆర్చరీ), భరత్‌ చెత్రి (హాకీ), బాబీ అలోసియస్‌ (అథ్లెటిక్స్‌), దత్తాత్రేయ దాదూ చౌగ్లే (రెజ్లింగ్‌).
లైఫ్‌టైమ్‌ ఎఛీవ్‌మెంట్‌ అవార్డు : క్లారెన్స్‌ లోబో (హాకీ), తారక్‌ సిన్హా (క్రికెట్‌), జీవన్‌ కుమార్‌ శర్మ (జూడో), వి.ఆర్‌.బీడు (అథ్లెటిక్స్‌).   kohli chanu khel ratna