కిం తో ట్రంప్ భేటీ త్వరలోన...

Header Banner

కిం తో ట్రంప్ భేటీ త్వరలోన...

  Tue Sep 25, 2018 19:00        Kuwait

- త్వరలో వివరాలు ఖరారు 
                      వాషింగ్టన్‌ : త్వరలోనే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో సమావేశమవుతానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తెలిపారు. అయితే సమావేశం వేదికను ఇంకా నిర్ణయించాల్సి వుంది. కిమ్‌ ఎలాంటి అరమరికలు లేకుండా చాలా పారదర్శకంగా వ్యవహరిస్తారని, ఏ విషయంలోనైనా స్పష్టమైన వైఖరితో వుంటారని, ఏదో కొంత మంచి జరగాలని ఆయన ఆశిస్తున్నారని తనకనిపిస్తోందని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌తో సమావేశంలో ట్రంప్‌ వ్యాఖ్యానించారు. మూడోసారి గత వారంలో మూన్‌, కిమ్‌తో భేటీ అయ్యారు. అమెరికా అధ్యక్షుడితో మరోసారి సమావేశమవాలని తాను ఆశిస్తున్నట్లు కిమ్‌ నుండి సందేశాన్ని ట్రంప్‌కు అందచేసినట్లు మూన్‌ తెలిపారు. రెండో సదస్సుకు కావాల్సిన ఏర్పాట్లు ఖరారు చేసేందుకు ఈ ఏడాది చివరిలోగా ఉత్తర కొరియా వెళతానని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో సోమవారం తెలిపారు.   kim to trump bheti