ప్రకృతి సేద్యంలో ప్ర‌పంచంలోనే అగ్రస్థానం

Header Banner

ప్రకృతి సేద్యంలో ప్ర‌పంచంలోనే అగ్రస్థానం

  Tue Sep 25, 2018 14:09        Auto

ప్రకృతి సేద్యంలో ప్ర‌పంచంలోనే అగ్రస్థానం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
ఐక్య‌రాజ్య‌స‌మితిలో కీల‌క ఉప‌న్యాసం

అమ‌రావ‌తి (న్యూయార్క్‌): ప్రకృతి సేద్యంలో ప్ర‌పంచంలోనే అగ్రస్థానంలో త‌మ రాష్ట్రం నిలిచింద‌ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. అమెరికా దేశంలోని న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో ప్రపంచ ఆర్థిక వేదిక-బ్లూంబెర్గ్‌ నిర్వహించిన ‘సుస్థిర అభివృద్ధి-ప్రభావం’ సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా కీలక ఉపన్యాసం ఇచ్చారు. రైతులకు ఖర్చును తగ్గించి చీడపీడల లేని కాలుష్య రహిత సాగును ప్రోత్సహించే దిశగా ప్రకృతి సేద్యాన్ని ప్రోత్స‌హిస్తున్నామ‌న్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి ఇప్పటికే లక్షల ఎకరాల్లో సాగయ్యేలా చేయడం, 2029 నాటికి 20 లక్షల ఎకరాలకు ఈ విస్తీర్ణాన్ని పెంచాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్య‌మ‌ని వివ‌రించారు. పైసా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయానికి అమెరికన్‌ సాంకేతికత, మేథో పరిజ్ఞానాన్ని జోడించేందుకు పరస్పర సహాయ సహకారాలపై ఆయన చర్చించారు. ఇప్పటికే దేశంలో ప్రకృతి సేద్యంలో నవ్యాంధ్ర అగ్రగామిగా ఎదిగి సాధిస్తున్న విజయాలను వివరించారు. ఐటి రంగంలో ప్ర‌పంచంలోనే భార‌త దేశం అగ్ర‌స్థానంలో ఉంద‌న్నారు. గత రెండు ద‌శాబ్ధాలుగా సాంకేతిక‌, ప్ర‌కృతి వ్య‌వ‌సాయం పెంపుద‌ల‌కు అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌న్నారు. మారుతున్న సాంకేతికత‌ను ఎప్ప‌టికప్పుడు అన్వ‌యించుకుంటూ ప్ర‌గ‌తి ప‌థంలోకి ముందుకు సాగుతున్నామ‌న్నారు. ఐటి రంగంలో ప్ర‌పంచానికే ఆద‌ర్శంగా ఉన్నామ‌ని గుర్తుచేశారు. ఆంధ్ర‌ప‌దేశ్‌లో 60 లక్ష‌ల మంది రైతు కుటుంబాలు ఉన్నాయ‌న్నారు. దేశంలో నేటికీ 62 శాతం మంది ప్ర‌జ‌లు వ్య‌వ‌సాయం, వ్య‌వ‌సాయ‌రంగ అనుబంధ ప‌రిశ్ర‌మ‌ల‌పై ఆధార‌ప‌డి జీవిస్తున్నార‌ని వివ‌రించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు 974 కిలోమీట‌ర్ల విశాల‌మైన స‌ముద్ర‌తీరం ఉంద‌ని గుర్తుచేశారు. భార‌త‌దేశంలోని న‌లుగురు ఐటి ఉద్యోగుల్లో ఒక‌రు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన వారు ఉన్నార‌న్నారు. సాంకేతిక‌త‌, వ్య‌వ‌సాయంపై ఆధార‌ప‌డిన ప్ర‌జ‌లు చాలా సంతోష‌క‌ర‌మైన జీవితాన్ని గ‌డుపుతున్నార‌ని గుర్తుచేశారు. భార‌త దేశ వ్య‌వ‌సాయ గిన్నెగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉంద‌న్నారు. ఈ సమావేశంలో కీలక ప్రసంగాలు చేసిన తొమ్మిది మందిలో చంద్రబాబు ఒకరు కావడం విశేషం.   cm ikyarajyasamiti lo speech