ఎమ్మెల్యే కొడుకు మోసం.. కుటుంబం ఆత్మహత్యాయత్నం!

Header Banner

ఎమ్మెల్యే కొడుకు మోసం.. కుటుంబం ఆత్మహత్యాయత్నం!

  Mon Apr 02, 2018 21:36        India, Telugu

జిల్లాలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టించింది. చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ నల్లాల ఒదేలు కుమారుడు క్రాంతి.. కోట్ల రూపాయలు మోసం చేశాడని, అడిగితే బెదిరిస్తున్నాడంటూ పసునూటి అరవింద్ కుటుంబం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించింది. ఇది గమనించిన స్థానికులు వారిని అడ్డగించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

 

బోర్‌వెల్స్ వ్యాపారంతో పాటు మంచిర్యాలలో షాపింగ్ మాల్ లావాదేవీల్లో తమకు ఒదెలు కుమారుడు క్రాంతి కోట్లలో ఇవ్వాల్సి ఉందని, అవి ఇవ్వకపోగా తమను బెదిరిస్తున్నారని అరవింద్, ఆయన భార్య సువర్ణ ఆరోపించారు. బెదిరింపుల నేపథ్యంలోనే ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు చెప్పారు. వీరి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 


   ఎమ్మెల్యే కొడుకు మోసం.. కుటుంబం ఆత్మహత్యాయత్నం!