సినిమా చూసి నా భార్య నన్ను మెచ్చుకుంది: హీరో నందు

Header Banner

సినిమా చూసి నా భార్య నన్ను మెచ్చుకుంది: హీరో నందు

  Mon Apr 02, 2018 21:34        Cinemas, India, Telugu

నందు, సౌమ్య వేణుగోపాల్, పూజా రామచంద్రన్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తోన్న చిత్రం ‘ఇంత‌లో ఎన్నెన్ని వింత‌లో’. వ‌రప్ర‌సాద్ వ‌రికూటి ద‌ర్శ‌కుడు. హరహర చలన చిత్ర సమర్పణలో ఎస్ శ్రీకాంత్ రెడ్డి, రామమోహన రావు ఇప్పిలి నిర్మిస్తున్నారు. ఈనెల 6న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం ఉదయం హైద‌రాబాద్ ఫిలిం ఛాంబ‌ర్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో హీరో నందు సినిమాకి సంబంధించిన విషయాలను తెలిపారు.

 

ఆయన మాట్లాడుతూ.. ‘‘ స్నేహితులు, బంధువులంతా సినిమా చూసి చాలా బాగుంద‌న్నారు. దీంతో మంచి సినిమా అనే న‌మ్మ‌కం బ‌లంగా ఉంది. అందుకే ప్ర‌మోష‌న్‌ను కూడా బాగా చేస్తున్నాం. మంచి ల‌వ్ స్టోరీ ఇది. నా ఫ్యామిలీ క‌ష్టాల్లో ఉంటే ఎలా కాపాడుకున్నాను అనేది ద‌ర్శ‌కుడు వైవిథ్యంగా చెప్పారు. ఒక హీరోకి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ప‌ర్‌ఫెక్ట్‌గా కుదిరాయి. ఇందులో పూజా రామచంద్ర‌న్ పాత్ర చాలా బాగా వ‌చ్చింది. సినిమాలో ఒక మెయిన్ ట్విస్ట్ ఆమె పాత్ర‌నే. ఉంగ‌రాల జుత్తు.. ఎట్రాటిక్ట్‌వ్‌గా ఉంటుంద‌ని త‌న‌ని తీసుకున్నాం. సౌమ్య వేణుగోపాల్ ‘కాట‌మ‌రాయుడు’ త‌ర్వాత చేస్తున్న సినిమా ఇది. ఆమె పాత్ర కూడా బాగుంటుంది. కృష్ణతేజ కామెడీ బాగా వ‌ర్కౌట్ అవుతుంది. హైద‌రాబాద్ ముస్లీమ్ పాత్ర‌లా ఉంటుంది. హీరోయిన్ స్నేహితులు ఇరుక్కునే ప‌రిస్థితులు చాలా స‌ర‌దాగా ఉంటాయి. నా భార్య గీతా మాధురి సినిమా చూసింది. మంచి సినిమా చేసావ్ అని మెచ్చుకుంది. ఇలాంటి క‌థ‌లే చేయ‌మ‌ని స‌ల‌హాలు ఇచ్చింది..’’ అన్నారు.

 


   సినిమా చూసి నా భార్య నన్ను మెచ్చుకుంది: హీరో నందు