గెలుపు ముఖ్యమే.. కానీ ఎలా గెలిచామనేది ఇంకా ముఖ్యం: సచిన్

Header Banner

గెలుపు ముఖ్యమే.. కానీ ఎలా గెలిచామనేది ఇంకా ముఖ్యం: సచిన్

  Wed Mar 28, 2018 22:01        India, Telugu

సౌతాఫ్రికాతో జరిగిన మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు బాల్ ట్యాంపరింగ్‌కి పాల్పడిన ఘటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. బాల్ ట్యాంపరింగ్ చేసినట్లు అంగీకరించిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లను ఏడాది పాటు, మైదానంలో ట్యాంపరింగ్ చేసిన ఓపెనర్ బాన్‌క్రాఫ్ట్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాదిపాటు నిషేధం విధించింది. తాజాగా ఈ ఘటనపై టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందంచారు. ట్విట్టర్ వేదికగా ఈ ఘటనపై ఆయన తన అభిప్రాయాన్ని తెలిపారు. ‘‘క్రికెట్ అంటే జెంటిన్‌మెన్‌ గేమ్ అని అంటారు. అది చాలా స్వచ్ఛంగా ఆడాల్సిన ఆట అని నేను అనుకుంటాను. జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం కానీ దానిపై తీసుకున్న నిర్ణయం మాత్రం సరైనది. క్రికెట్‌లో గెలుపు ముఖ్యమే.. కానీ ఏ విధంగా గెలిచామనే విషయం కూడా అంతే ముఖ్యమని’’ సచిన్ ట్వీట్ చేశారు. స్మిత్, వార్నర్‌లను క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధించడంతో వాళ్లని ఐపీఎల్ నుంచి కూడా బహిష్కరిస్తున్నట్లు చైర్మన్ రాజీవ్ శుక్లా ప్రకటించారు.   గెలుపు ముఖ్యమే.. కానీ ఎలా గెలిచామనేది ఇంకా ముఖ్యం: సచిన్