ఫ్రెడరల్ ఫ్రంట్ దిశగా ప్రయత్నాలు ప్రారంభించిన కేసీఆర్

Header Banner

ఫ్రెడరల్ ఫ్రంట్ దిశగా ప్రయత్నాలు ప్రారంభించిన కేసీఆర్

  Wed Mar 28, 2018 21:56        India, Telugu

ఫ్రెడరల్ ఫ్రంట్ దిశగా ప్రయత్నాలు ప్రారంభించిన తెలంగాణ సీఎం కేసీఆర్ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కలిశారు. జాతీయ రాజకీయాల్లో సమీకరణలు మారుతున్న తరుణంలో కేసీఆర్‌ని సోరెన్ కలవడం ప్రధాన్యత సంతరించుకుంది. ఫ్రెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తానని కేసీఆర్ ప్రకటించిన వెంటనే హేమంత్ సోరెన్ మద్దతు తెలిపారు. ఇందుకనుగుణంగానే హైదరాబాద్ వచ్చి సీఎం కేసీఆర్‌ని కలిశారు. సోరెన్‌కు కేసీఆర్ సాదర స్వాగతం పలికారు. సోరెన్ పిల్లలకు బ్యాగులను బహూకరించారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ జరిగింది.   ఫ్రెడరల్ ఫ్రంట్ దిశగా ప్రయత్నాలు ప్రారంభించిన కేసీఆర్