స్మిత్‌పై టీం ఇండియా మాజీ బౌలర్ ప్రశంసలు

Header Banner

స్మిత్‌పై టీం ఇండియా మాజీ బౌలర్ ప్రశంసలు

  Mon Mar 26, 2018 22:28        India, Sports, Telugu

బాల్ ట్యాంపరింగ్‌లో అడ్డంగా దొరికిపోయిన ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు ఎదురుకుంటుంది. ముఖ్యంగా ట్యాంపరింగ్‌కి ప్లాన్ చేసిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై అభిమానులు, మాజీ క్రికెటర్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కానీ స్మిత్‌కు టీం ఇండియా మాజీ పేసర్ నుంచి మాత్రం ప్రశంసలు వచ్చాయి. స్మిత్ తన తప్పుని ఒప్పుకొని కెప్టెన్సీని వదులుకోవడం చాలా గొప్ప విషయమని టీం ఇండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా అన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న నెహ్రా.. ఈ వివాదంపై స్పందించాడు.

 

‘‘జీవితకాల నిషేధం ఏ ఆటగాడికైన చాలా కఠిన శిక్ష, వాళ్లు తాము చేసిన తప్పుల్ని స్వచ్ఛందంగా ఒప్పుకున్నారు. అది పరిగణలోకి తీసుకొని.. వాళ్ల శిక్ష గురించి ఆలోచించాలి. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం, ఒక మ్యాచ్ నిషేధం విధించడం సరిపోతుంది అని అనుకుంటున్నా’’ అని నెహ్రా పేర్కొన్నాడు. ఇప్పటికే బాల్ ట్యాంపరింగ్ వ్యవహారంపై స్పందించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ కెప్టెన్ పదవి నుంచి స్మిత్‌ను తొలగించి అతని స్థానంలో అజింక్యా రహానేకి బాధ్యతలు అప్పగించింది. ఈ ఘటనపై క్రికెట్ ఆస్ట్రేలియా విచారణ పూర్తైన తర్వాత డేవిడ్ వార్నర్ విషయంలో నిర్ణయం తీసుకుంటామని సన్‌రైజర్స్ హైదరాబాద్ మెంటర్ వీవీఎస్ లక్ష్మణ్ తెలిపారు.

 


   స్మిత్‌పై టీం ఇండియా మాజీ బౌలర్ ప్రశంసలు