‘భరత్ అనే నేను’ అప్‌డేట్ వచ్చేసింది

Header Banner

‘భరత్ అనే నేను’ అప్‌డేట్ వచ్చేసింది

  Fri Mar 23, 2018 22:48        Cinemas, India, Telugu

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై స్టార్‌ ప్రొడ్యూసర్‌ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న భారీ చిత్రం 'భరత్‌ అనే నేను'. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ అలాగే ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని వచ్చిన మహేష్‌ ట్రెడిషనల్‌ లుక్‌‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాటను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది.
 
25 మార్చి ఉదయం 10 గంటలకు భరత్ అనే నేను చిత్రంలోని మొదటి పాటను విడుదల చేస్తున్నామంటూ.. ఈ పాట విడుదలకు సంబంధించిన పోస్టర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇప్పటికే దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ‘రంగస్థలం’ పాటలు పెద్ద హిట్టయ్యాయి. ఇప్పుడు భరత్‌కి దేవి.. ఏ రేంజ్ పాటలను ఇస్తున్నాడో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అల్రెడీ కొరటాల, మహేష్, దేవి కాంబినేషన్‌లో వచ్చిన ‘శ్రీమంతుడు’ పాటలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇదే కాంబినేషన్‌లో వస్తున్న ‘భరత్ అనే నేను’ ఆల్బమ్‌ కూడా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని మహేష్ అభిమానులు ఆశిస్తున్నారు.


   ‘భరత్ అనే నేను’ అప్‌డేట్ వచ్చేసింది